Bavagaru bagunnara: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథ మరొక హీరో చేయడం సహజంగా జరిగేవే. అలా కథ ఒక హీరో నుంచి మరొక హీరోకి, ఒక దర్శకుడి నుంచి మరొక దర్శకుడికి, అలాగే సగంలో నిర్మాత మారడం లాంటివి అనేక కారణాల వల్ల జరుగుతుంటాయి. ఇలా చేతులు మారిన ప్రాజెక్ట్ భారీ హిట్ అవొచ్చు. లేదా నిర్మాత నట్టేట మునిగే ప్రాజెక్ట్ కూడా కావచ్చు. అయితే అలా ఫ్లాపయిన ప్రాజెక్ట్స్ వల్ల నిర్మాతలు ఇండస్ట్రీలో కనుమరుగైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ఓ ప్రాజెక్ట్ మెగా ఫ్యామిలీలో చేతులు మారింది.
ప్రేమించుకుందాం రా సినిమాతో టాలీవుడ్లో క్రేజీ డైరెక్టర్‌గా మారాడు జయంత్ సి పరాన్జి. వెంకటేశ్ కెరీర్లో ప్రేమించుకుందాం రా ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. మహేష్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ప్రేమించుకుందాం రా సినిమా టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. అంతేకాదు దర్శకుడుగా జయంత్ పేరు మార్మోగిపోయింది. వరుసగా బడా నిర్మాతలు ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు స్టార్ హీరోలు కూడా ఆయనతో సినిమా చేయడానికి డేట్స్ ఇచ్చారు.
Bavagaru bagunnara: మెగాస్టార్ చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంటూ వచ్చాయి.
ఒక్క సినిమాతో అంత క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఇండస్ట్రీలో ఒక భారీ హిట్ ఇచ్చాడంటే ఆ డైరెక్టర్‌కి మెగా హీరోలు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో వారితో సినిమాలు చేయడానికి రెడీ అవుతారో అందరికీ తెలిసిందే. అదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు జయంత్. ఆ సినిమానే బావగారు బాగున్నారా. ఈ సినిమాను మెగా బ్రదర్ నాగ బాబు, అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. రంభ ఇందులో హీరోయిన్గా నటించింది. హిట్లర్ సినిమాతో ఫాంలోకి వచ్చిన మెగాస్టార్ వరుసగా మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, ఇద్దరు మిత్రులు..ఇలా సినిమాలను లైన్లో పెట్టారు. అంతేకాదు ఆ సమయంలో మెగాస్టార్ చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంటూ వచ్చాయి.
అయితే మెగాస్టార్ నటించిన బావగారు బాగున్నారా సినిమా వాస్తవంగా దర్శకుడు జయంత్ సి పరాన్జి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తయారు చేసిన కథ. ఆయనతో ఈ సినిమా చేయాలనుకున్నారు. పవన్ కళ్యాణ్‌కి కథ కూడా చెప్పారు. ఇందులో ఉన్న కామెడీ ట్రాక్, ఫ్యామిలీ ఎమోషన్స్ పవన్ కళ్యాణ్‌కి బాగా నచ్చిన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయనతో సినిమా అంటే కొన్నాళ్లు ఆగాల్సి వచ్చింది.
Bavagaru bagunnara: స్వయంగా పవన్ కళ్యాణ్ దర్శకుడు జయంత్ కి సూచించారట.
దాంతో ఇదే కథ అన్నయ్య అయితే ఇంకా బావుంటుంది. ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని స్వయంగా పవన్ కళ్యాణ్ దర్శకుడు జయంత్ కి సూచించారట. ఇక నిర్మాత ఎటూ నాగ బాబు కావడంతో సమస్యే లేదు. కథలో మెగాస్టార్‌కి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేసి మెగాస్టార్‌కి చెప్పగా ఆయన వెంటనే చేసేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా బావగారు బాగున్నారా సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉండగా మెగాస్టార్ చేసి భారీ కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో ఆయన వేసుకున్న పాయింట్ ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది.