BBUtsavam : ఇవాళ సండే స్పెషల్ గా సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. ఇప్పటికే బీబీఉత్సవానికి BBUtsavam సంబంధించిన చాలా ప్రోమోలను రిలీజ్ చేశారు. కానీ.. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చూస్తే మాత్రం మరోసారి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసినట్టే ఉంటుంది.
మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్లంతా కలిసి చేసుకున్న ప్రైవేటు పార్టీ ఇది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అంతా అక్కడికి వచ్చి వాళ్ల మెమోరీస్ ను మరోసారి గుర్తు చేసుకున్నారు.
బిగ్ బాస్ సీజన్ 4 ఎంత సూపర్ సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. బిగ్ బాస్ సీజన్ 4 కు వచ్చిన క్రేజ్ ఏ సీజన్ కు రాలేదు. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అందరూ సెలబ్రిటీలు అయిపోయారు.
అందుకే.. మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి బీబీఉత్సవం అంటూ ప్రైవేటు పార్టీని స్టార్ మా నిర్వాహకులు అరేంజ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది.
పండుగలా BBUtsavam
ఒక పండుగలా బీబీఉత్సవాన్ని బిగ్ బాస్ కంటెస్టెంట్లు జరుపుకున్నారు. ఈసందర్భంగా.. శ్రీముఖికి సోహెల్ ప్రపోజ్ కూడా చేశాడు. నాకోసం ఏమైనా తెచ్చావా? సోహెల్ అంటూ శ్రీముఖి అడిగేసరికి.. నీకోసం నా హార్ట్ నే ఇచ్చేస్తా.. అంటూ శ్రీముఖిని స్టేజ్ మీదనే ప్రపోజ్ చేశాడు.
అయితే.. అదంతా ఏదో సరదాకు లేండి. ఇలా.. ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్ సరదాగా ఎంజాయ్ చేశారు. గంగవ్వ కూడా ఈ ప్రోగ్రామ్ కు వచ్చి ఎంజాయ్ చేసింది.
ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.