Bigg boss Telugu : బిగ్ బాస్ తెలుగు Bigg boss Telugu షో మిగితా భాషల్లో వచ్చే షోల కన్నా.. ఎక్కువ పాపులారిటీని తెచ్చుకున్నది. బిగ్ బాస్ తమిళం, హిందీ, కన్నడ కన్నా కూడా తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బిగ్ బాస్ షోకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కు బిగ్ బాస్ షో తర్వాత మంచి లైఫ్ దొరికింది.

అందుకే బిగ్ బాస్ తెలుగు షోను, బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లకు బయట అంత డిమాండ్ ఉంది. కంటెస్టెంట్లు కూడా బయట ఏం చేసినా ఒక రికార్డే అవుతోంది. వాళ్లు యూట్యూబ్ వీడియో చేసినా అది ట్రెండింగ్ అవుతోంది. మొత్తం మీద బిగ్ బాస్ షోలోకి వెళ్తే చాలు.. పెద్ద సెలబ్రిటీ అయి తిరిగి వస్తున్నారు అంతా.
Bigg boss Telugu : బిగ్ బాస్ మూడు సీజన్ల కంటెస్టెంట్లతో రీయూనియన్
అయితే.. గత వారమే బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ కంటెస్టెంట్లతో రీయూనియన్ ఏర్పాటు చేశారు. గెట్ టుగెదర్ లా ఏర్పాటు చేసిన ఆ పార్టీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. బిగ్ బాస్ 1, 2, 3 మూడు సీజన్ల కంటెస్టెంట్లను పిలిచి వాళ్లతో బిగ్ బాస్ ఉత్సవం పార్ట్ 2 ప్రోగ్రామ్ ను నిర్వహించారు. అది ఇవాళ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది.
అయితే.. ఈసందర్భంగా బిగ్ బాస్ వన్ కంటెస్టెంట్ హరితేజ శ్రీమంతాన్ని బీబీఉత్సవం స్టేజ్ మీదనే నిర్వహించారు. మొత్తం మీద స్టార్ మా టీవీ టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా చేసేలా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్లను, ఆయా కంటెస్టెంట్లను తమ టీఆర్పీ కోసం బాగానే ఉపయోగించుకుంటున్నారు.
బీబీఉత్సవం పార్ట్ 2 ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేయండి.