NewsOrbit
న్యూస్

కరోనా ను జయించడానికి…శతాబ్దం కిందటి టీకా ఉపయోగపడుతుందా….?

 

 

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలలో వ్యాపించి సంవత్సరం దాటినా,ఈ వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈమహమ్మారినీ ఎదుర్కొనేందుకు టీకా తో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔషధాల పైన కూడా ముమ్మర ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా శతాబ్దం కిందటి క్షయ వ్యాక్సిన్‌కు కరోనాతో పోరాడే శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం, క్షయవ్యాధికి పురాతన వ్యాక్సిన్లలో ఒకటి అయ్యిన బాసిల్లస్ కాల్మెట్-గురిన్ (బిసిజి) కరోనా ను ఎదురుక్కొనే రోగనిరోధక శక్తీ ఇవ్వడం లో సహాయపడుతుంది అన్ని గుర్తించారు. ముఖ్యంగా వైరస్‌ సంక్రమణను తగ్గించడంలో బీసీజీ టీకా మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు.

 

BCG Vaccine

ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్‌లో ప్రచురించిన అధ్యయనంలో భాగంగా, ఆసుపత్రిలోని దాదాపు 6వేల మంది ఆరోగ్యకార్యకర్తల రక్తాన్ని సేకరించి కొవిడ్‌ యాంటీబాడీల గురించి విశ్లేషించారు. అనంతరం వీరి ఆరోగ్య చరిత్రను అడిగి తెలుసుకున్నారు. టీబీ వ్యాక్సిన్‌ తీసుకోని వారికంటే బీసీజీ తీసుకున్న వారిలో దాదాపు 30శాతం మందికి కరోనా వైరస్‌ సోకలేదని విషయాన్ని గుర్తించారు. బీసీజీ టీకాలు తీసుకోని వ్యక్తుల్లో కంటే టీకా తీసుకున్న కొందరిలో తక్కువ యాంటీబాడీలను గుర్తించారు. టీకా తీసుకున్న వారిలో కొవిడ్‌ యాంటీబాడిల స్థాయి తక్కువగా ఉండడానికి ఆ టీకానే కారణమా? అనే విషయంపై స్పష్టత లేదని పరిశోధకుడు మోషే అర్థితి అభిప్రాయపడ్డారు. బీసీజీ సమూహంలో కోవిద్-19 యాంటీబాడీ స్థాయిలు తక్కువగా ఉండటానికి కారణాలు స్పష్టంగా లేవని అధ్యయనం యొక్క సహ-సీనియర్ రచయిత మోషే ఆర్డిటి తెలిపారు.ఒక్కోసారి వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటే యాంటీబాడీల స్థాయి కూడా తక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏదేమైనా కరోనా సంక్రమణను తగ్గించడంలో బీసీజీ ప్రభావం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు.

శ్వాసకోశ సమస్యలతో సహా ఇతర ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో బీసీజీ టీకా సమర్థవంతంగా పనిచేస్తుండడంతోనే కరోనాపై పరిశోధనలు ప్రారంభించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.టీకాల ద్వారానే శ్వాసకోశ వ్యాధుల నుంచి శాశ్వత ఉపశమనం ఉంటుందని భావించడం సహజమైనందున.. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీజీ ఆశాజనకంగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు. సమర్థవంతమైన వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేవరకు ఇది కొంత ప్రయోజనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కచ్చితంగా తెలుసుకునేందుకు భారీ స్థాయిలో బీసీజీ టీకాపై పరిశోధనలు జరపాల్సిన అవసరాన్ని సెడార్స్‌-సినాయ్‌ వైద్యులు సూచిస్తున్నారు.

కోవిద్-19 కు వ్యతిరేకంగా ఒక నిర్దిష్ట వ్యాక్సిన్ కంటే బీసీజీ మరింత ప్రభావవంతంగా ఉంటుంది అన్నే విషయాన్ని ఎవరూ విశ్వసించలేదని పేర్కొన్న ఆర్డిటి, ఇది చాలా త్వరగా నిరూపించబడిన బలమైన భద్రతా ప్రొఫైల్‌ను కలిగి ఉన్నందున, దీనిని మరింత త్వరగా ఆమోదించవచ్చు అన్ని, అలాగే అందుబాటులో ఉంచవచ్చని వివరించారు.

అమెరికా లో మూత్రాశయ క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి ,క్షయవ్యాధి బారిన పడిన వారి చికిత్సలో బీసీజీ వ్యాక్సిన్‌ను వాడేందుకు ఎఫ్‌డీఏ అనుమతి ఉంది. వివిధ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలోనూ ఇది ప్రయోజనకారిగా ఉండడంతో, కరోనా వైరస్‌పై దీని ప్రభావాన్ని తెలుసుకునేందుకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి, “మా పరిశోధనల ప్రకారం, బిసిజి టీకాలు కరోనా వైరస్ సంక్రమణకు వ్యతిరేకంగా రక్షణాత్మక ప్రభావాన్ని కలిగిస్తాయో లేదో నిర్ధారించడానికి క్లినికల్ ట్రయల్స్ అత్యవసరంగా అవసరమని మేము నమ్ముతున్నాము” అన్నీ సెడార్స్-సినాయ్‌లోని స్మిత్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో ప్రజారోగ్య పరిశోధన కార్డియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ​​సుసాన్ చెంగ్ అన్నారు.

కోవిద్ -19 కు వ్యతిరేకంగా బీసీజీ టీకా యొక్క సంభావ్య రక్షణ ప్రభావాలను అధ్యయనం చేయడానికి అనేక క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించబడ్డాయి. టెక్సాస్‌ ఎ&ఎం యూనివర్సిటీ, బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌, సెడార్స్‌-సినాయ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో బీసీజీ టీకాపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటు భారత్‌లోనూ టీబీ టీకాపై ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి. బీసీజీ టీకా వల్ల వయోధికులకు ప్రయోజనం ఉంటుందా? అనే అంశంపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) కూడా అధ్యయనం చేస్తోంది.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju