పిల్లల తో బెస్ట్ నాన్న అనిపించుకోవాలంటే వారితో చిన్ననాటి నుండే మంచి సాన్నిహిత్యం ఏర్పరుచుకోవాలి.మీకు చదువుకునే పిల్లలు ఉంటే వారికి హోం వర్క్ చేసుకోవడం లో హెల్ప్ చేయండి.పిల్లలు అడిగే ప్రశ్నల కు ఏదో ఓ సమాధానం చెప్పేయకుండా… . తెలిస్తే సరైన సమాధానం చెప్పాలి. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుని చెబుతానని చెప్పాలి.
ఎప్పుడూ ఇంట్లో అమ్మ వంటే కాదు నాన్న వంట ఎలా ఉంటుందో వారికి తెలియచేయాలి. అందుకోసం మీరు నలభీముడు కానవసరం లేదు. బ్రెడ్ స్లైడ్స్ , ఫ్రూట్స్ ఇలాంటి వాటితో కూడా ఎదో ఒకటి తయారు చేసి పెట్టిన కూడా పిల్లలకు అది సంతోషాన్ని ఇవ్వడంవలన చాలా రోజుల పాటు గుర్తుంటుంది. కాబట్టి, అప్పుడప్పుడు అలాంటివి చేస్తూ ఉండండి. పిల్లలకు అత్యంత ఇష్టమైన వాటిల్లో బయటకు వెళ్లడం అనేది ఒకటి.
అది ఆడుకోవడానికైనా, లేకపోతే ఊరికే సరదాగా తిరగడానికైనా కావొచ్చు.అప్పుడప్పుడు కుటుంబం తో కలసి టూర్లు వెళ్ళడానికి ప్లాన్ చేయండి. ట్రావెలింగ్ వలన మాత్రమే వారికి ప్రపంచం తెలుస్తుంది. వాళ్లు ఉండే ఊరి లో కనిపించని కొత్త కొత్త విషయాలు అక్కడ అక్కడ చూస్తుంటారు.వాటి గురించి వాళ్లు తెలుసుకుంటారు. నాన్న భుజాల మీద నుంచి ప్రపంచాన్ని చూడడం అలాంటి సందర్భాల్లోనే అలవాటు చేసుకుంటారు.
సమయం, సందర్భం కాకపోయినా సడన్‌గా ఓ గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారంటే మీరు మీ పిల్లలకు బెస్ట్ డాడ్ గా ఉండగలుగుతారు. చదువుతో పాటు క్రియేటివిటీ కూడా నేర్పండి. మీకు వచ్చిందే వాళ్లకు నేర్పండి లేదా ఇంకాసమయం ఉంటే మీరు నేర్చుకుని వారికి నేర్పండి. అది పెయింటింగ్ లేదా మ్యూజిక్ ఏదైనా కావొచ్చు. పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేస్తే బెస్ట్ డాడ్ అయిపోతారని ఎప్పుడు భావించకండి. ఏది మంచిది? ఏది చెడు.. ఏది అవసరం ఏది అనవసరం చెప్తూ వారిని సన్మార్గంలో నడిపే వాళ్లే అసలైన బెస్ట్ డాడ్ అని గుర్తుపెట్టుకోండి .
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…