Beast Movie : తమిళ తంబీలు ఎంతగానో ఎదురు చూస్తున్న విజయ్ సినిమా బీస్ట్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. తమిళ నటుడు విజయ్ కు తమిళంతోపాటు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉన్న సంగతి తెలిసినదే. విజయ్ నుండి కొత్త సినిమా అనగానే కోలీవుడ్ మాదిరిగానే టాలీవుడ్లో కూడా ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘బీస్ట్’. ఈ ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి ‘వరుణ్ డాక్టర్’ సినిమాతో వినూత్న డైరెక్టర్‌గా పేరుపొందిన నెల్సన్ దర్శకత్వం వహించాడు.
Beast Movie : సినిమా బ్యాక్ డ్రాప్ అదేనా?
ఇక ఈ మూవీ టీం ఈ చిత్ర ట్రైలర్‌ని ఇటీవలే విడుదల చేయడంతో సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొంతకాలం క్రితం ఈ సినిమానుండి విడుదలైన ‘అరబిటు కుతు’ సాంగ్ ఎలాంటి బీభత్సం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా టెర్రరిజం ప్రధాన అంశంగా తెరకెక్కిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ సినిమాలో విజయ్ ‘రా’ ఏజెంట్‌గా నటించాడట. దీంతో కువైట్‌లో ఈ చిత్ర ప్రదర్శనపై నిషేధం విధించారు.
ఇందుకే నిషేధమా?
ఇక దీనికి సంబంధించి ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు ‘రమేశ్ బాలా’ చేసిన పోస్ట్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఇలా రాసుకొచ్చాడు.. ‘కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ బీస్ట్ మూవీని బ్యాన్ చేసింది. ఇదే దీనికి అసలైన కారణం.. సినిమాలో పాకిస్తాన్ గురించి, టెర్రరిస్ట్‌లను, వయెలెన్స్‌ని చూపించడం వలన అది జరిగింది. ఎందుకంటే గతంలో కూడా కురుప్, FIR వంటి భారతీయ సినిమాలపై సైతం కువైట్‌లో నిషేధం విధించారు. ఇలాంటి విషయాల్లో కువైట్ సెన్సార్ చాలా ఖచ్చితంగా వ్యవహారిస్తోంది’ అంటూ ఆయన విశ్లేషించారు.