అందాని కి కేరాఫ్ అడ్రస్ ఆడవారి నడుము.ఆడవారి అందాన్ని అంచనా వేయాలంటే నడుమే అగ్రస్థానము లో ఉంటుంది. ఆ నాటి కవుల దగ్గర నుండి ఈ నాటి సినీ కవుల వరకు ఆడవారి సన్నని నడుము గురించి కవితలు ,పాటల తో ఆడవారి అందాన్ని పోలుస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చాలామంది హీరోయిన్స్ లో ఈ నడుమే ప్రత్యేక అందంగా ఉన్నవారు కూడా ఉన్నారు.
అయితే.. ఇంత గొప్పదనమేమిటి. ఆ నడుము ప్రత్యేకత ఏంటి?.. అది కూడా శరీరంలోని ఒక భాగమేగా అనుకుంటున్నారా… కానీ దానికంటూ ప్రత్యేకత ఉందంటున్నారు విశ్లేషకులు.. ఇదే విషయంపై పరిశోధన కూడా చేశారు. ఔరా! నడుము పై పరిశోధనలు ఏమిటి అనుకుంటున్నారా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సహజం గా నాజుకైన నడుము భాగానికి పురుషుల్లో ఎక్కువమంది దాసోహం అంటారు.. అలాంటి సన్నని నడుము కలవారిని భాగస్వామిగా చేసుకునేందుకు పురుషులు ఇష్టపడతారు. దీని వెనుక కేవలం లైంగిక పరమైన కోణమే కాదు.. శాస్త్రీయ కోణం కూడా ఉంది. నడుము భాగం 45.5 డిగ్రీలు ఉన్న స్త్రీలు గర్భవతులైనప్పుడు వారి శరీరంలోని ముందు, వెనుక భాగాలు సమానంగా ఉండీ ఎక్కువసార్లు గర్భం దాల్చగలిగే శక్తి ఉంటుందని పరిశోధకులు తెలియచేసారు.
అయితే, ఈ కారణం తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలియని వారు ఆకర్షణతో సన్నని నడుము ఇష్టపడుతుంటే.. తెలిసిన వారు ఆకర్షణ మరియు శాస్త్రీయ కోణం కలగలిపి మరి ఇష్టపడుతున్నారు.ఇదే సన్నటి నడుమ వెనుక ఉన్న వాదన అని పరిశోధకులు పరిశోధన చేసి మరీ తేల్చారు . ఈ పరిశోధనలో భాగం గా శాస్త్రవేత్తలు కొంతమంది మగవారికి స్త్రీల జఘన భాగం ఉన్న ఫొటోలు చూపారు. ఆ ఫోటోలలో ఆకర్షణీయమైన ఘనమైన జఘన భాగమున్న స్త్రీల నే పురుషులు ఎన్నుకున్నారు . ఇప్పటికైనా తెలుసుకోండి.. నడుము గొప్పదనం అంటున్నారు పరిశోధకులు.