చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యం గా ఉంటారన్న సంగతి తెలిసిందే. గుడ్డు లో ఉండే తెల్ల, పచ్చ సొనలు రాసుకోవడం వల్ల అందం గా మారుతాం అని తెలుసా?గుడ్డు లో లభించే పోషకాలు ముఖానికి జుట్టు కి కూడా ఎంతో మెరుపునిస్తాయి.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
గుడ్డులో ఉండే తెల్లని సొనలో ముల్తానీ మట్టి, అరటిపండు గుజ్జు, ఈ మూడింటిని బాగా కలిపి వచ్చిన మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగితే కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది.. ముఖం మీద ముడతలు రాకుండా కూడా ఈ ప్యాక్ సమర్ధవంతం గా పని చేస్తుంది.
గుడ్డు తెల్లసొనలో, నిమ్మ రసం, తేనె, దోస రసం కలిపి రాసుకోవడం వల్ల ముఖం మీద ఏర్పడ్డ మచ్చలు, కంటి కింద ఉండే నల్లని వలయాలు మాయమవుతాయి .
ఇంకా పచ్చ సొన లో తేనె కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం కొత్త కాంతిని సంతరించుకోవడమే కాకుండా.. ముడతలను పోగొడుతుంది.
పచ్చ సొనలో కొద్దిగా ఆల్మండ్ ఆయిల్, అలోవేరా జెల్ కలిపి రాసుకుంటే, డ్రైస్కిన్ ఉన్న వారికి ఈ ప్యాక్ ఎంతో బాగా పని చేస్తుంది.
ఇప్పుడు కోడిగుడ్డు ను ఉపయోగించి జుట్టు మెరిసేలా చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం..
చాలా సందర్భాల్లో జుట్టుపొడిగా నిర్జీవంగా మారిపోతుంటుంది. అలా అనిపించినప్పుడు గుడ్డులోని తెల్లసొన తీసుకుని జుట్టుకి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటి ని ఉపయోగించి జుట్టు ను శుభ్రం చేసుకో వాలి. జుట్టు పట్టుకుచ్చులా మారాలంటే 15 రోజులకోసారి ఇలా చేయవలిసి ఉంటుంది. రెండు గుడ్ల లోని పచ్చ, తెల్లసొన తీసుకుని రెండు టేబుల్ స్పూన్స్ తేనె రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, తో బాగా కలిపి జుట్టు కుదుళ్లకి రాసాక 70 శాతం వరకు ఆరనిచ్చి మాములు నీటితో కడిగేసుకోవాలి. జుట్టు పొడవు పెరగాలని కోరుకునే స్త్రీలు ఇలా ప్రయత్నించి చూడండి..