విజయ్ సేతుపతి విలక్షణమైన నటనతో కోలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్ తో పలు క్రేజీ సినిమాలు చేస్తున్నాడు విజయ్ సేతుపతి. అప్పట్లో త్రిష తో కలిసి నటించిన 96 సినిమా విజయ్ సేతుపతి కి చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమాతోనే ఫేడవుట్ అయిందనుకున్న త్రిష మళ్ళీ కం బ్యాక్ అయి ఇప్పుడు 7 భారీ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకుంది. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. నయన తార, సమంత హీరోయిన్స్ గా నటిస్తుండగా ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
అలాగే విజయ్ సేతుపతి విజయ్ నటించిన మాస్టర్ తో పాటు .. తెలుగులో మెగా హీరో డెబ్యూ సినిమా ఉప్పెన సినిమా కూడా రిలీజ్ కి రెడిగా ఉన్నాయి. ఇలా విజయ్ సేతుపతి కి ఉన్న క్రేజ్ వల్ల అటు తమిళం, ఇటు తెలుగు సినిమాలతో బిజిబిజీగా ఉన్నాడు. ఆ మధ్య మెగాస్టార్ నటించిన సైరా లో కూడా మంచి రోల్ చేసిన విజయ్ సేతుపతి ఆ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో ముఖ్య పాత్ర కి కమిటయి అనూహ్యంగా తప్పుకున్నాడు.
కాగా ఇప్పుడు ఒక బాలీవుడ్ సినిమా నుంచి కూడా విజజ్ సేతుపతి తపుకున్నట్టు లేటెస్ట్ న్యూస్. బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ గా క్రేజ్ ఉన్న అమీర్ ఖాన్ లాల్ సింగ్ ఛద్దా అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకోసం అమీర్ ఖాన్ .. విజయ్ సేతుపతిని కీలక పాత్ర కోసం తీసుకున్నాడు. అయితే పాత్ర కి తగ్గట్టు కాస్త బరువు తగ్గమని అమీర్ ఖాన్ .. విజయ్ సేతుపతికి సూచించాడట. కాని ఇది విజయ్ సేతుపతి వల్ల కాకపోవడం తో ఈ సినిమా నుంచి తీసేసినట్టు సమాచారం. మొత్తానికి కారణం ఏదైనా విజయ్ సేతుపతి ఈ మధ్య వరసగా క్రేజీ సినిమాలనుంచే తప్పుకుంటున్నాడని అంటున్నారు.
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…
దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…
ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ తెరకెక్కించిన…
సౌత్‌తో పాటు నార్త్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. తాజాగా `సీతారామం`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మలయాళ…