Bigg Boss 5 Telugu: లోబో చేసిన పనికి రవి టీంకి బిగ్గెస్ట్ భారీ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..??

Share

Bigg Boss 5 Telugu: “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో గ్రీన్ టీం సభ్యులు..లోబో, రవి, శ్వేత. మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో.. ఈ టాస్క్ లో సరికొత్త బొమ్మను రవి టీం గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో సూపర్ పవర్ రవి టీంకి బిగ్ బాస్ ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో ప్రత్యర్థి టీమ్ లలో ఒకటి సెలెక్ట్ చేసుకుని వారు సంపాదించిన.. బొమ్మ లను స్వాధీనం చేసుకోవచ్చు. ఈ తరుణంలో రవి టీం .. మానస్ టీం నుండి బొమ్మలు తీసుకున్నారు. ఈ క్రమంలో శ్వేత.. యానీ మాస్టర్ ల మధ్య.. గొడవ చోటు చేసుకుంది. అయితే “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ ముగిసే సమయానికి రవి టీంకి బిగ్ బాస్ బిగ్గెస్ట్ భారీ ట్విస్ట్ ఇచ్చాడు. బొమ్మలు తయారు చేసే క్రమంలో లోబో…హౌస్ లో పిల్లో స్ నీ… చింపటం జరిగింది.

అందులో దూదీని కూడా వాడటం జరిగింది. గేమ్ పరంగా ఈ ఎత్తుగడ బానే ఉన్నా గానీ బిగ్ బాస్ రూల్స్ పరంగా హౌస్ లో ఉన్న ఏ వస్తువునీ… నాశనం చేయకూడదు. బిగ్ బాస్ హౌస్ కి సంబంధించి ఎటువంటి ప్రాపర్టీ కి డ్యామేజ్ జరగకూడదు. ఈ క్రమంలో డ్యామేజ్ చేస్తే సదరు కంటెస్టెంట్ కి గట్టిగానే శిక్ష విధించడం గత సీజన్లలో జరిగింది. ఇటువంటి రూల్ ఉన్న తరుణంలో..లోబో టాస్క్ కోసం ఇంట్లో ఉన్న పిల్లోస్ నీ… ధ్వంసం చేయడం జరిగింది. దీంతో రవి టీం నీ… కెప్టెన్సీ టాస్క్ నుండి బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడం జరిగింది. సూపర్ పవర్ వచ్చిన గాని లోబో చేసిన పనికి టాస్క్ నుండి ఎలిమినేట్ కావటంతో..రవి, శ్వేత బాధ పడ్డారు. ఇదిలా ఉంటే “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో మానస్, శ్రీరామ్ టీంలు… గెలిచినట్లు సమాచారం.

Bigg Boss Telugu 5: Lobo gets caught smoking again

ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి

ఇదిలా ఉంటే గేమ్ అయిపోయిన తర్వాత శ్వేత.. ఓడిపోవడంతో గుక్కపెట్టి బాగా ఏడవటం జరిగిందట. కెప్టెన్సీ టాస్క్ లో… ఎలాగైనా గెలవాలని.. ఈవారం బాగా కసిగా ఆడింది. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన నాటి నుండి శ్వేత.. దూసుకుపోతూ చాలా వైల్డ్ గా హౌస్ లో వ్యవహరిస్తోంది. ఎంతో ఇంట్రెస్ట్ తో శ్వేత.. ఈ వారం గేమ్ ఆడుతుండగా లోబో… చేసిన పనికి.. మొత్తానికి ఆమె వేసుకున్న ప్లాన్స్ మొత్తం తలకిందులు అయిపోయాయి. ఆరవ వారంలో ఎలాగైనా కెప్టెన్సీ ఇవ్వాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాదాపు సగం గేమ్ పూర్తికావస్తున్న క్రమంలో ఎవరికి వారు.. మరింత ఫోకస్ చేస్తూ… హౌస్ లో రాణిస్తున్నారు. ఈ క్రమంలో రవి కెప్టెన్ అవ్వాలని కూడా అనేక కలలు కంటూ… మిగతా టిమ్ సభ్యులను.. ఏకం చేస్తూ.. గ్రూప్ గేమ్ ప్రారంభంలో స్టార్ట్ చేయగా అది బెడిసి కొట్టి చివరాకరికి వాళ్ళ టీం.. యే.. ఏకంగా కెప్టెన్సీ టాస్క్ నుండి బిగ్ బాస్ హెల్మెట్ చేయటం.. సంచలనంగా మారింది. లోబో చేసిన పనికి మొత్తం కష్టపడి పాయింట్లు తెచ్చుకుని మరి సూపర్ పవర్ తో మరొక టీం నీ.. దెబ్బ కొట్టాలని చూసిన గాని అన్ని ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇటువంటి తరుణంలో ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారన్నది సోషల్ మీడియాలో డిస్కషన్లు గట్టిగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా మానస్ లేదా సన్నీ, సిరిలో ఒకరు అయ్యే ఛాన్స్లు  ఎక్కువగా ఉన్నాయని… పింకీ అయినా అవ్వచ్చు అని.. విశ్లేషిస్తున్నారు.


Share

Related posts

తమిళనాడు బీజేపీ సీఎం అభ్యర్థి..??

sekhar

Darsha Gupta Latest Photoshoot

Gallery Desk

నలుగురు డైరెక్టర్లతో చిరంజీవి..!!

sekhar