Bigg Boss 5 Telugu: రవి దెబ్బకు బలైపోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదానిపై సోషల్ మీడియాలో విపరీతంగా డిస్కషన్ జరుగుతుంది. మొత్తం ఐదుగురు సభ్యులు ఈ వారం నుండి ఎలిమినేట్ అవ్వడానికి.. నామినేట్ అయ్యారు. శ్రీ రామచంద్ర, మానస్, ప్రియాంక సింగ్, ప్రియ, లహరి. అయితే ఇప్పటిదాకా ఓటింగ్ పరంగా చూసుకుంటే.. శ్రీ రామ్ చంద్ర, మానస్, ప్రియాంక సింగ్.. కి భారీ ఎత్తున ఓట్లు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సింగర్ శ్రీరామ్ చంద్ర కి.. ముందు నుండి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతోపాటు హౌస్ లో.. ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వటంతో.. పాటు ఎవరి ట్రాప్ లో పడకుండా తనదైన శైలిలో గేమ్ ఆడుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇదే తరుణంలో.. ప్రియాంక సింగ్ కూడా అనవసరమైన విషయాల్లోకి వెళ్లకుండా… గేమ్ ఆడుతూ వస్తోంది.

Bigg Boss Telugu 5 preview: Ravi and Lahari hit back at Shailaja Priya for making 'offensive' comments; here's what netizens think - Times of India

మానస్ కూడా తన గేమ్ తాను ఆడుతున్నాడు. ఎటొచ్చి ప్రస్తుతం ఓటింగ్ పరంగా చూసుకుంటే ప్రియ లహరి మధ్య ఈ వారం ఎలిమినేషన్ .. ఎవరో ఒకరు అయ్యేటట్టు ఉందని టాక్. లహరి పై నామినేషన్ టైం లో ప్రియా చేసిన వ్యాఖ్యలు ఆమెపై భయంకరమైన నెగిటివిటీ తీసుకొని రాగా… మొన్నటిదాకా ప్రియా ఓటింగులో వెనకబడిపోయింది. ఇక ఇదే సమయంలో తర్వాత రోజు ప్రియా తప్పులేదని రవి చెప్పడం వల్లే ప్రియా ఆ విధంగా మాట్లాడినట్లు.. వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో బయటపడటంతో ప్రియా కి.. ఓటింగ్ శాతం పెరుగుతుంది. మరోపక్క లహరి ఓటింగ్ శాతం చివరిలో తగ్గి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రవి ప్రియ డిస్కషన్ వల్ల లహరి ఇంటి నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఎక్కువ ఉన్నాయని..

ఆడియన్స్ నుండి వినబడుతున్న టాక్. రవి ప్రియ తో మాట్లాడిన వీడియో ఫుటేజ్ బయట పడకుండా ఉంటే కచ్చితంగా.. ప్రియా ఎలిమినేట్ అయ్యేది అని… కానీ ఇప్పుడు ఆ ఫుటేజ్ బయటపడటంతో లెక్కలు మొత్తం మారిపోయాయని.. లహరి ఇంటి నుండి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్. ఇదిలా ఉంటే హౌస్ లో అమ్మాయిలు అబ్బాయిలు అనే కన్వర్జేషన్ రావటానికి.. కారణం రవి అని బయట జనాలు అంటున్నారు. ఇంటి సభ్యుల మధ్య రవి గుంటనక్క మాదిరిగా గొడవలు పెడుతున్నాడని..ఒకరి విషయాలు మరొకరి దగ్గర తెలియజేస్తూ… ఇష్టానుసారంగా బిగ్ బాస్ ఇంటిలో చలామణి అవుతున్నాడు అని.. యాంకర్ రవి ఆడుతున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి.

 

మరోపక్క లహరి దగ్గర ఒకలాగా ప్రియా దగ్గర మరొక లాగా.. రవి మాట్లాడిన తీరు పై ఈ వీకెండ్ ఎపిసోడ్ లో… నాగార్జున ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా నెలకొంది. ఈ ఫుటేజ్ విషయంలో గనుక… నాగార్జున రియాక్ట్ అవ్వక పోతే మాత్రం బిగ్ బాస్ … షో నిర్వాహకులు సపోర్టు రవికి ఫుల్ గా ఉన్నట్లే అన్న టాక్… డిస్కషన్లు బయట జరుగుతున్నాయి. మరోపక్క ఇదే సమయంలో నటరాజ్ మాస్టర్.. గుంటనక్క అని పరోక్షంగా రవి టైటిల్ అవతారం లో తప్పు లేదని.. బయట బలంగా టాక్ వస్తోంది. ప్రియా రవి లహరి ఎపిసోడ్ లో యాంకర్ రవి… క్రేజీ మసకబారి పోతుందని.. మరి కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా ప్రియా లహరి రవి.. గొడవ విషయంలో దాదాపు లహరికి ఓటింగ్.. శాతం తగ్గుముఖం పట్టడం..తో.. ఈ వారం ఎక్కువగా లహరి ఇంటి నుండి బయటకు వెళ్లే అవకాశం ఉందని.. ఇప్పటి దాక పడిన ఓట్ల బట్టి.. బయట జనాలు భావిస్తున్నారు.


Share

Related posts

ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీల పదవి ఉండేనా ? ఊడేనా ?

Yandamuri

సూపర్ హిట్ రీమేక్ లో హీరోగా సునీల్ .. కాని ఈ ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేదు ..?

GRK

అల్లూ అరవింద్ దగ్గర సమంత అంత తీసుకుంటోందా ?? వామ్మో !

Naina