Bigg Boss 5 Telugu: టెలివిజన్ రంగంలో యాంకర్ రవికి తిరుగులేని క్రేజ్. పంచ్ డైలాగులతో ఇటువంటి సందర్భంలో ఆయన ఎంటర్టైన్మెంట్ వాతావరణం క్రియేట్ చేసే యాంకర్ రవి.. బుల్లి తెరపై మాత్రమే కాక సినీ ఫీల్డ్ లో కూడా పెద్ద పెద్ద అవార్డుల ఫంక్షన్ లను డీల్ చేయడం జరిగింది. దీంతో మనోడు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడంతో కచ్చితంగా రవి.. టైటిల్ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ప్రారంభంలో అందరూ భావించారు. కానీ రవి హౌస్ లో అసలు రూపం బయటపడటంతో… సోషల్ మీడియాలో యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ కి పెద్ద గుంటనక్క అని.. నటరాజ్ మాస్టర్ కరెక్ట్ టైటిల్ పెట్టారని.. డిస్కషన్ లు చేసుకుంటున్నారట.
హౌస్ లో మనోడు గేమ్ కంటే ఇతరుల గేమ్ లో… ఎక్కువ వేలు పెట్టి అనవసరంగా తనకున్న క్రేజ్ తగ్గించేసుకుంటున్నాడని… జనాలు భావిస్తున్నారు. వేసే స్ట్రాటజీ లు… కెమెరాల ముందు అడ్డంగా తగ్గిపోవటంతో పాటు కంటెస్టెంట్ ల దగ్గర ఒకలాగా మాట్లాడి దొరికిపోయాక మరలా మాట్లాడుతూ మాటలు మార్చడంతో.. మనోడు వాళ్ళ హౌస్ లో చాలా మంది సభ్యులు బలయిపోయినట్లే తాజా ఎలిమినేషన్ లో.. శ్వేతా వెళ్లిపోవడంతో.. సరికొత్త డిస్కషన్ సోషల్ మీడియా లో స్టార్ట్ అయింది. రవి వలన ఇప్పటివరకు హౌస్ నుండి వెళ్లిపోయిన వారి సంఖ్య చూసుకుంటే.. సగానికి సగం రవి వలనే.. ఇంటి నుండి ఇ ఎలిమినేట్ అయినట్లు జనాలు చెప్పుకుంటున్నారు.
“బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో….
లహరి, శ్వేత ఇద్దరు ఇంటి నుండి ఎలిమినేట్ అవటానికి గల ప్రధాన కారణం రవి అని… అతనితో ఫ్రెండ్షిప్ చేసిన చాలామంది పరిస్థితి ఈ విధంగానే తయారయిందని బయట జనాలు అంటున్నారు. “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో ఇంటిలో పీల్లో దుద్దే నీ… కావాలని కట్ చేయమని రూల్ తెలిసినా కానీ రవి చెప్పటం వల్ల.. శ్వేత ఆరో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు..సో రవి.. అంతా తెలిసే ఈ దొంగ నాటకాలు ఆడుతున్నారు.. అంటూ అతడు ఆడుతున్న ఆటతీరుపై బయట జనాలు మండిపడుతున్నారు. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో రవి వల్ల చాలామంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవుతున్నట్లు చెప్పుకొస్తున్నారు.