NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత రాక నేపథ్యంలో ఈ కీలక పరిణామాలు

Share

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిద్దమైయ్యారు. మరి కొద్ది సేపటిలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి న్యాయవాదితో సహా కవిత హజరుకానున్నారు. కవితను అరుణ్ రామచంద్ర పిళ్లై, మనీశ్ సిసోడియాలతో కలిపి ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంతకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించడంతో కవితను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు సీబీఐ అధికారులు కవిత ఇంటికి వెళ్లి విచారణ జరపగా, ఈడీ అధికారులు మాత్రం ఢిల్లీలోని కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. తొలుత 9వ తేదీ విచారణ కు రావాలని నోటీసులు జారీ చేయగా, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల హజరు కాలేననీ, 15వ తేదీ తర్వాత విచారణకు వస్తానని కవిత ఈడీకి తెలియజేయగా వారు అంత సమయం ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో 11వ తేదీ విచారణకు హజరు అవుతానని చెప్పడంతో అందుకు ఈడీ అంగీకరించింది.

MLC Kavitha

 

అయితే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై వ్యాంగ్మూలం ఆధారంగా కవితను విచారించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత ను ఈడీ నోటీసులు జారీ తర్వాత మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను కవితకు బినామీ అంటూ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు రామచంద్ర పిళ్లై తెలిపారు. ఇందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ పై ఈ నెల 13న విచారణ జరగనున్నది. ప్రస్తుతం అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీలో ఉన్నారు.

కవిత విచారణ నేపథ్యంలో మరో పక్క తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒక వేళ కవితను అరెస్టు చేస్తే తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళన చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సన్నద్దం అవుతున్నారు. కవితకు బాసటగా నిలిచేందుకు మంత్రులు కేటిఆర్, హరీష్ రావు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర బలగాలతో భద్రతను పెంచడమే కాక ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ను విధించారు. పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే అరుణ్ రామచంద్ర పిళ్లై తను ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో పాటు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇవేళ విచారణ అనంతరం కవితపై బలవంతపు చర్యలు ఏమీ ఉండవచ్చని భావిస్తున్నారు. అరుణ్ పిళ్లై వాంగ్మూలంపై కోర్టు నిర్ణయం తర్వాతనే ఈడీ ఈ కేసులో నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.


Share

Related posts

Ghani: ఆ కారణంగానే గని సినిమా విషయంలో మేకర్స్‌కు పెద్ద టెన్షన్..?

GRK

YS Viveka Murder case: సుప్రీం కోర్టులో నేడు సునీత పిటిషన్ పై విచారణ.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

somaraju sharma

Anushka Shetty: పాన్ ఇండియా సినిమాకు అనుష్క శెట్టి గ్రీన్ సిగ్నల్..దర్శకుడెవరంటే..!

GRK