మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.. చివరికి?

ఖ‌తార్‌లోని దోహా విమానాశ్ర‌యంలో ఆస్ట్రేలియా మ‌హిళ‌ల ప‌ట్ల అక్క‌డి అధికారులు అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. దీంతో ఖ‌తార్ సర్కారుపై ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వివ‌రాల్లోకెళ్తే.. దోహా విమానాశ్ర‌యంలోని టెర్మిన‌ల్ బాత్రూంలో ఓ పిండం బ‌య‌ట‌ప‌డింది. దీంతో విమానంలో ఉన్న 13 మంది ఆస్ట్రేలియా మ‌హిళ‌ల‌ను మిమానం నుంచి కింద‌కు దించి వారి ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు అక్క‌డి అధికారులు.

స‌ద‌రు మ‌హిళ‌ల జ‌న‌నాంగాల‌ను ప‌రిశీలించ‌డానికి వారంద‌రిని కింద‌కు దించారు. మ‌హిళ‌ల‌ను వారి దుస్తుల‌ను తోల‌గించ‌మ‌ని ఆదేశించి.. వారి అనుమ‌తి లేకుండా దుస్తులు తొల‌గిస్తూ విమానాశ్ర‌య అధికారులు దుందుడుకుగా ప్రవ‌ర్తించారు. దుస్తులు తొల‌గించే స‌మ‌యంలో అస‌భ్య‌క‌ర రీతిలో అధికారులు న‌డుచుకున్నార‌ని సెవెన్ న్యూస్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. అయితే, అవ‌మాన‌క‌ర‌మైన ఈ శారీర‌క ప‌రీక్ష‌కు ముందు మ‌ర‌ణించిన శిశువు గురించి మ‌హిళ‌ల్లో ఎవ‌రికీ చెప్ప‌లేదు.

అయితే, ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన అనంత‌రం స‌ద‌రు మ‌హిళ‌లు ఒక హోటల్లో నిర్భంధంలో ఉండ‌గా.. ప‌లువురు ఆస్ట్రేలియ‌న్ బ్రాడ్‌క్యాస్టింగ్ కార్పోరేష‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఆ స‌మ‌యంలో దర్యాప్తు ప్రారంభించే అధికారం ఆస్ట్రేలియా ప్రభుత్వానికి లేదు కాని ఈ సమస్యను పరిష్కరించడానికి విదేశీ వ్యవహారాల శాఖ ఖతార్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు స‌మాచారం. అయితే, తాజ‌గా స‌ద‌రు మ‌హిళ బృందాన్ని సంప్ర‌దించిన ప్ర‌భుత్వం ఈ ఘ‌ట‌న‌పై ఆందోళ‌న‌తో పాటు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఖ‌తార్ ప్ర‌భుత్వం ఈ ఘ‌ట‌న‌పై వెంట‌నే త‌మ‌కు వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ఆస్ట్రేలియా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.