Children : సాధారణంగా పిల్లల్లో కనిపించే  ప్రవర్తనా లోపాలు గురించి తెలుసుకుందాం!!

సాధారణంగా పిల్లల్లో కనిపించే  ప్రవర్తనా లోపాలు గురించి తెలుసుకుందాం!!
Share

Children: సాధారణంగా పిల్లలలో  ఉండే కొన్ని ప్రవర్తనా లోపాలు వయసు పెరిగేకొద్దీ కనబడవు . ఉదాహరణకు పక్క తడపడం,వేళ్ళు నోట్లో పెట్టుకోవడం,పిల్లల్లో ప్రవర్తన లోపాలకు గల కారణాలు :

behavioral-disorders-in-children
behavioral-disorders-in-children

పిల్లల్లో  ఉండే కొన్ని ప్రవర్తనా లోపాల కు తల్లిదండ్రుల తీరు, ప్రవర్తన కారణమవుతుంది అని గుర్తు పెట్టుకోండి. కొన్ని కొన్ని కారణాల వలన తల్లిదండ్రులు పిల్లలపై  ద్వేషం ఉన్నట్లు  ప్రవర్తించడం, గొడవపడటం, తిరస్కరించడం, అతిగా డిమాండ్ చేయడం, పిల్లల మధ్య భేదం చూపించడం, అతి జాగ్రత్తగా ఉంచడం , అతి ప్రేమ చూపడం వల్ల పిల్లల్లో ప్రవర్తనా లోపాల కు  దారితీస్తాయి.వీటితో పాటు పిల్లలకు సంబంధించిన విషయంలో తల్లిదండ్రులు ఎక్కువగా  గొడవపడుతుండడం.. పిల్లలముందే గొడవపడటం వల్ల పిల్లల్లో ఆతురత పక్క తడపడం వంటి ప్రవర్తన లోపాలు  వస్తాయి.

శారీరక సంబంధమైన లోపాలు చెవులు వినబడక పోవడం, చాలా పొడవుగా ఉండడం, మొర్రి పెదవి, తొర్రి ఉండటం. ఎటువంటి పిల్లలు అధికంగా మాట్లాడటం, పొగరుబోతు తనం, పనులు ఆలస్యంగా చేయడం, అతిగా భయపడటం, దొంగిలించడం వంటి పనులు చేస్తూ ఇతరుల శ్రద్ధ తమపై ఉండాలని అలా  ప్రవర్తిస్తుంటారు . ఈ శారీరక సంబంధమైన లోపాలు పిల్లల్ని మామూలు పిల్లల్లాగా ఆడుకోవడానికి అవరోధం గా ఉంటాయి . అందువల్ల పిల్లల తల్లిదండ్రులు  లేదా ఇతర కుటుంబ సభ్యులు వారిని బెదిరించడం, తొందర పెట్టడం, హింసించడం వంటివి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పోషకాహార లోపం వల్ల రక్తంలో కొన్ని రసాయనాల మార్పు  వల్ల పిల్లలు చికాకుగా, కోపంగా ప్రవర్తించడానికి  కారణమవుతుంది.

తల్లిదండ్రులు పిల్లలపై తగినంత ప్రేమ చేయకపోవడం వల్ల, తరచు శిక్షించడం వంటి ప్రవర్తన వల్ల పిల్లల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది . ఇలాంటి పిల్లలు దొంగిలించడం, కోపంగా ప్రవర్తించడం వంటివి  ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా అసహజంగా ప్రవర్తిస్తూ తల్లిదండ్రులపైన ఇతర కుటుంబ సభ్యుల పైన ప్రతీకారం తీర్చుకుంటారు. ఇంకా  కొన్ని సందర్భాల్లో వేళ్ళు నోట్లో పెట్టుకోవడం, గోళ్ళు కొరకడం వంటివి కూడా చేస్తుంటారు. తల్లిదండ్రులు తరచూ పిల్లల ముందు గొడవ పడడం  వల్ల వారిలో అభద్రతాభావం ఏర్పడుతుంది.

 


Share

Related posts

Bollywood :బాలీవుడ్ ఇండస్ట్రీని మళ్ళీ కుదిపేస్తున్న కరోనా..!

GRK

Relationship tips: మీవారు బిజీ గా ఉండి మీకు టైం కేటాయిన్చడం లేదని బాధ పడుతున్నారా?ఇలా చేయండి వారు మీ చుట్టూ తిరుగుతారు.

Kumar

కలిసి వచ్చిన 72 గంటల తరవాత గుడ్ న్యూస్ చెప్పిన అమిత్ షా ?

sekhar