ట్రెండింగ్ న్యూస్

బెల్ ఉద్యోగాల గంట మోగించింది..!!

Share

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగుళూరులోని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)   వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. Bharat Electronics Limited ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 52  పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

BEL Notification released see the details

మొత్తం ఖాళీలు: 52 పోస్టులు
విభాగాల వారీగా :
1. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైయినీ (Engineering Assistant Trainee ): 25 పోస్టులు

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లమో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. మూడు సంవత్సరాల నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ కోర్స్ చేసి ఉండాలి.

2. టెక్నీషియన్ technician C : 27 పోస్టులు

అర్హతలు : SSLC + ఐ టి ఐ ఉత్తీర్ణత తో పాటు మూడు సంవత్సరాల నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ కోర్స్ చేసి ఉండాలి.

వయసు : 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ , ఎస్టీ లకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు మూడేళ్లు , పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా
అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను అర్హతలు, ఇతర వివరాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష విధానం :
ఈ పోస్టులకు మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలు పార్ట్-1 , పార్ట్-2 రెండు విధాలుగా ఉంటుంది. పార్ట్-1 లో 50 మార్కులకు ఉంటుంది. పార్ట్-2 ను 100 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ. 300/-, ఎస్సీ, ఎస్టీ , పిడబ్ల్యుడి అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ : 3/2/2021

వెబ్ సైట్ : www.bel-india.in

ఇది కూడా చదవండి : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లో వివిధ ఖాళీలు


Share

Related posts

Heat: వేసవికాలం ఒంట్లో వేడి తగ్గాలంటే ఇవి తినండి..!!

bharani jella

Jr Ntr-Buchi babu: ఎన్టీఆర్ తో బుచ్చిబాబు..! లోకల్ కథను అంతర్జాతీయంగా..!

Muraliak

Tdp : చంద్రబాబు చేసిన చిన్న పనికి పొంగిపోతున్న టీడీపీ కార్యకర్తలు..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar