Bellamkonda srinivas : టాలీవుడ్లో పాన్ ఇండియన్ స్టార్ అంటే ఎవరు చెప్పినా ప్రభాస్ పేరే చెప్తారు. ఆయనకి బాహుబలి సినిమాతో వచ్చిన పాన్ ఇండియన్ క్రేజ్ అంతా ఇంతా కాదు. మొదటి సినిమా ఈశ్వర్ నుంచి సినిమా సినిమాకి ప్రభాస్ తన రేంజ్ అండ్ స్టార్ డమ్ ని పెంచుకుంటూ వచ్చాడు. వర్షం, ఛత్రపతి ప్రభాస్ కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాలు. అంతేకాదు ప్రభాస్ కెరీర్లో టాప్ టెన్ సినిమాలలో నిలిచేవి కూడా. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛత్రిపతి మైల్ స్టోన్ మూవీ. భారీ యాక్షన్ సినిమాలకి ప్రభాస్ పర్ఫెక్ట్ కటౌట్ అని ఇండస్ట్రీ మొత్తం చెప్పుకున్నారు.
ఆ స్థాయి క్రేజ్ తెచ్చిపెట్టారు రాజమౌళి. ఇక రాజమౌళి కెరీర్లో ఈ సినిమా మైల్ స్టోన్ మూవీనే. అందుకే ఈ సినిమా రాజమౌళి, ప్రభాస్‌లకి ఎంతో ప్రత్యేకం. అలాంటి సినిమా మరో భాషలో రీమేక్ అవుతుందంటే ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా రాజమౌళి – ప్రభాస్ కాంబినేషనే రిపీటవుతుందని బ్లైండ్‌గా నమ్ముతారు. కానీ ఇప్పుడు సినిమా మాత్రమే అదే కథతో తెరకెక్కుతోంది. కాంబినేషన్ మాత్రం మారిపోయింది. బాలీవుడ్లో రీమేక్ కాబోతున్న ఈ సినిమా ద్వారా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు.
Bellamkonda srinivas : ఈ సినిమాతో అక్కడ పెద్ద ప్రయోగమే చేస్తున్నారు.
వి.వి.వినాయక్ దర్శకులుగా, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా డెబ్యూ ఇస్తున్న ఈ సినిమాతో అక్కడ పెద్ద ప్రయోగమే చేస్తున్నారు. ఇక ప్రభాస్ లాంటి కటౌట్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ గంటలకొద్దీ ఇంట్లోనే కసరత్తులు చేస్తున్నాడట. ఇక భాష మీద మంచి పట్టు కోసం ప్రత్యేకంగా ఓ హిందీ మాస్టర్‌ను నియమించుకొని హిందీ నేర్చుకుంటున్నాడట. మొత్తానికి బాలీవుడ్ మార్కెట్ మీద బెల్లంకొండ హీరో చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఇక ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో హీరోయిన్ సహా ఇతర నటి నటులను, టెక్నికల్ టీం ని వెల్లడించనున్నారట.