సహజసిద్ధమైన పదార్థాలనుతీసుకోవడం వలన ఎప్పుడు ఆరోగ్యం గా ఉండవచ్చు. శరీరకంగా, మానసికంగా ఆరోగ్యం గా ఉండడానికి బాదం పప్పుచాల ముఖ్యపాత్ర పోషిస్తుంది. పోషకాహారంగా ఉండడం తోపాటు, కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం మంచి ఔషధం గా కూడా పనిచేస్తుంది.
బాదంను నేరుగా తినడం కంటే, ఒక పూట నీళ్ళ లో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరను తీసేసి, ముద్దగా నూరుకుని వాడడం ఆరోగ్యానికి మంచిది. ఇలా చేయడం వల్ల బాగా జీర్ణమై శరీరానికి వంట బడుతుంది. అలా వంటబట్టినప్పుడే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
బాదం పాలు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. బాదం పప్పులను 5లేదా 6 నానబెట్టి, పొట్టు ఒలిచి… మెత్తగా రుబ్బి,ఒక గ్లాస్ కాచి చల్లార్చిన నీళ్ళలో రుబ్బుకున్న మిశ్రమాన్ని , పాలలా చిక్కగా కనబడేలా కలుపుకోవాలి. అంతే బాదం పాలుసిద్దమైనట్టే. బాదం లో కొలెస్ట్రాల్ ఉండదు. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇందులో ఉన్న వాటి గురించి ఆలోచించవలిసిన అవసరం లేదు.అందుకే ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది. గుండెను ఆరోగ్యంగా ఉంచడం లో బాదం పాలు బాగా పనిచేస్తాయి.
బాదం పాలలో హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా, సోడియం తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. అలాగే చేపలలో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా బాదాం తో పుష్కలం గా దొరుకుతుంది. అందువల్ల ఇది గుండె జబ్బులను మరియు బ్లడ్ ప్రెజర్నుతగ్గేలా చేస్తుంది. ఇకపోతే.. బాదం పాల తో కండరాలు బలం గా తయారవుతాయి. ఎముకలు దృఢం గా ఉంటాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. ముఖ్యంగా తెలుసుకోవాలిసింది ఏమిటంటే, బాదం పప్పులు మరీ ఎక్కువగా తింటే శరీరానికి వేడి చేస్తుంది.
కాబట్టి, రోజూ 4 పప్పులు తినాలి. బాదంలలో మన జుట్టుకు అవసరమైన అన్ని రకాల విటమిన్లూ, పోషకాలూదొరుకుతాయి. ప్రధమంగా జుట్టునుదృఢంగా, బలంగా,ఆరోగ్యం గా ఉండేలా చేసే మెగ్నీషియం, జింక్, విటమిన్ E బాదంలలో లభిస్తాయి. అలాగే జుట్టు రాలిపోకుండా ఎక్కువ కాలం నిలిచివుండేలా చేసే విటమిన్ B… బాదంపప్పుల్లోదొరుకుతుంది.