చికెన్ అంటే చాల మంది బాగా ఇష్టపడతారు. అసలు చికెన్ తో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందా. బ్రాయిలర్ చికెన్ లో ఎక్కువ ప్రోటీన్, తక్కువ కొవ్వు పదార్థాలుఉంటాయి. గుండె ఆరోగ్యం గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. బ్రాయిలర్ కోడి మాంసం తినడం వల్ల హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించి గుండె పనితీరును సక్రమం గా చేస్తుంది. ఈ చికెన్లో భాస్వరం సంవృద్ధిగా ఉండడం వలన ఎముకలు, దంతాలుదృఢం గా ఉంటాయి.
శరీరం యొక్క జీవక్రియను మెరుగుపరచడంలో బ్రాయిలర్ చికెన్లో ఉండే సెలీనియం ఉపయోగపడుతుంది. ఇది కండరాల పనితీరు, అభివృద్ధిని సక్రమం గా ఉండేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెరగడానికి, బరువు తగ్గడానికి కూడా బ్రాయిలర్ చికెన్ ఉపయోగపడుతుంది. ఇక పెరిగే పిల్లల విషయానికి వస్తే,చికెన్ బూస్ట్ లా పనిచేస్తుంది. పిల్లల ఎదుగుదలకు చికెన్ లో ఉండే అధికమైన అమినోఆసిడ్స్ బాగా బాగా సహాయపడతాయి .
ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం బ్రాయిలర్ చికెన్లో ఉంది.. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. పెద్ద వయస్సు లో ఉన్నవారు బోలు ఎముకల వ్యాధి ,ఆర్థరైటిస్, వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు బ్రాయిలర్ చికెన్ తింటే ఆ సమస్య లను తగ్గించుకోవచ్చు.చికెన్ లో విటమిన్ బి5 లేదా ఒత్తిడిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓ మంచి చికెన్ ఐటెం తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. రుతుక్రమ సమస్యలు మరియు మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. పీరియడ్స్ సమయంలో చికెన్ ఆహారంగా తీసుకోవడం వలన మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత వస్తుంది.
ఐతే అదేపనిగా ఏ పదార్థం తిన్నా కూడా ఆరోగ్యం పాడవుతుంది. కనుక చికెన్ బావుందనో లేదా ఇష్టమనో అదేపనిగా తినేస్తే మాత్రం అనారోగ్యం తప్పదు. కనుక వారానికి ఒకసారి మాత్రమే చికెన్ తినడమనేది మంచిది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?