పాతకాలంలో ఆముదాన్నే ఎక్కువగా వాడేవారు.ఆముదం గింజల నుంచి ఈ నూనెను తీస్తారు. ఆముదం లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. మనకుఅనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకునేందుకు ఆముదం బాగా పనిచేస్తుంది. ఆముదం తో ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఆముదాన్ని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరం లో చేరే బాక్టీరియాలకు ,టాక్సిన్ల కు వ్యతిరేకంగా పోరాడే లింఫోసైట్ల ఉత్పత్తిని ఆముదం పెరిగేలా చేస్తుంది.
ఆముదాన్ని తాగితే మలబద్దకం సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. పేగుల గోడలను ఆముదం ఉండే రికినోలీయిక్ యాసిడ్ మెత్తగా మారుస్తుంది. దీంతో పేగుల్లో ఉన్న మలం సులభంగా కదిలి సుఖవంతం గా విరేచన రూపం లో బయటకు వచ్చేస్తుంది.
ఆముదాన్ని తాగితే ఆ కొవ్వు పదార్థాలను శరీరం బాగా శోషించుకుంటుంది. దీంతో హార్మోన్లుపనితీరు మెరుగై. హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. జీవక్రియలు కూడా మెరుగుపడతాయి. ఆముదంను కాలిన గాయాలు, ఇన్ఫెక్షన్లు, పుండ్లు ఇతర గాయాలపై రాస్తుంటే గాయాలు త్వరగా మానిపోతాయి.
యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఆముదం లో ఉండడం వలన నొప్పులు త్వరగా తగ్గుతాయి. ఆముదం ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి కూడా బాగా పనిచేస్తుంది. వేడి చేసిన ఆముదం నొప్పి ఉన్న చోట రాస్తుంటే ఎలాంటి నొప్పి అయినా సరే వెంటనే తగ్గిపోతుంది.
ఆముదాన్ని ప్రతి రోజు తలకు రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. చర్మానికి రాసుకుంటే చర్మం పగలకుండా మృదువుగా మారుతుంది. కాబట్టి ఆముదాన్ని మళ్ళి వాడకం లోకి తీసుకువచ్చి జుట్టు చర్మ సమస్యలు తగ్గించుకోండి. నెలలో ఒక్కసారి అయినా ఆముదం తాగడం వలన పొట్ట శుభ్రపడుతుంది.