గంజాయిని పొగ రూపంలో సిగరెట్‌లాగా తాగితే… ఆరోగ్యానికి చాలా హానికరం. అదే గంజాయి నుంచీ తీసిన నూనె (CBD Oil or Hemp Oil)తో మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వాటిగురించి తెలుసుకుందాం..గంజాయి నూనెను సైంటిఫిక్ రూపంలో CBD అంటారు. గంజాయి మొక్క నుంచీ 104 రకాల రసాయనాల్ని సేకరిస్తారు. వాటన్నింటినీ కలిపి కన్నబినాయిడ్స్ అంటారు. వాటిలో నూనె అనేది ఒకటి. ఈ గంజాయిని కాన్నబిస్ లేదా మారిజువానా మొక్క అని కూడా పిలుస్తారు.
CBD వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో… ఔషధాల తయారీలో దాన్ని ఎక్కువగా వాడుతున్నారు. గంజాయి నూనెను కొబ్బరినూనె లాంటి వాటితో కలిపి వాడుకోవాలి. విపరీతమైన నొప్పులను, టెన్షన్లను దూరం చెయ్యడంలో ఈ నూనె చాల బాగా పనిచేస్తోంది. గంజాయి నూనెను నొప్పి నివారిణిగా క్రీస్తుపూర్వం 2900 నుంచీ వాడుతున్నట్లు తెలిసింది.
గంజాయి నూనె (CBD Oil)తో మసాజులు, మర్దనల వంటివి చేసుకుంటే, ఎంతో చల్లగా,హాయిగా ఉంటుందనీ, టెన్షన్ల నుంచీ ఉపశమనం పొందుతామని పరిశోధనల్లో తేలింది. టెన్షన్ తగ్గేందుకు వాడే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ గా ఉంటాయి. అదే ఈ నూనె వాడితే అలాంటివి చాలా తక్కువ గాఉంటాయి అంటున్నారు డాక్టర్లు.CBD ఆయిల్‌తో తలకు మర్దన చేసుకుంటే, చక్కగా నిద్ర పడుతుందట. బ్రెయిన్ మత్తులోకి జారుకొని… కలలప్రపంచంలోకితీసుకెళ్తుందట.
కేన్సర్‌ను తగ్గించే లక్షణాలు కూడా CBD ఆయిల్లో ఉన్నాయి. కేన్సర్ ఉన్నవారికి వికారంగా, వాంతులు అయ్యేలా ఉంటుంది. నొప్పిగా కూడా అనిపిస్తుంది. అలాంటి వారికి ఈ నూనెతో మసాజ్ చేస్తే, చాలా ఉపశమనం ఉంటుందంటున్నారు.ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, మొటిమలు, మచ్చల ను పూర్తిగా తగ్గిస్తాయట.మతిమరపు లక్షణాలు తగ్గాలన్న ఈ నూనెతో తలకి మసాజ్ చేసుకోవాలి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల నుంచీ మనల్ని ఈ నూనె బాగా కాపాడుతుంది.
హైబీపీని తగ్గించడంలో కూడా CBD ఆయిల్ బాగా పనిచేస్తోంది.గంజాయి నూనె వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆకలి ఎక్కువగా వేస్తుంది. డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది అలసటగా ఉన్నట్లు అనిపిస్తోందని కూడాచెప్పారు . అందువల్ల డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే ఈ నూనె వాడటం అన్నివిధాలా మంచిదంటున్నారు. డాక్టర్ వాడొచ్చంటే మాత్రం చక్కటి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు .