వీటిని తినడం వలన బాదం తో సమానమైన ఫలితాన్ని తక్కువ ఖర్చుతో పొందవచ్చు…

వీటిని తినడం వలన బాదం తో సమానమైన ఫలితాన్ని తక్కువ ఖర్చుతో పొందవచ్చు...
Share

శనగలను.. పేదవాడి బాదాం అనిపిలవడానికి కారణం . బాదాంలోదొరికే ప్రొటీన్ శాతంశనగల ను తినడం వలన  కూడా పొందవచ్చు. కాబట్టి.. అత్యంత ఖరీదైన బాదాం కంటే.. తక్కువ రేటు లో అందరికీ అందుబాటులో ఉండే.. శనగలు తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.శనగల్లో మన శరీరానికి అవసరమైన చాల  పోషకాలు  ఉన్నాయి. కాబట్టి వీటిని  కొంచెం తిన్నా చాలా శక్తి వచ్చి ఆరోగ్యం గా ఉంటాం.శనగ ల్లో విటమిన్లు ఎక్కువ.

వీటిని తినడం వలన బాదం తో సమానమైన ఫలితాన్ని తక్కువ ఖర్చుతో పొందవచ్చు...

శెనగల్లో ఉండే మెగ్నీషియం, పాస్పరస్, వంటి ఖనిజాలుఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాన్ని ఇస్తాయి. హైబీపీ నితగ్గేలా చేస్తాయి . వారం లో  2 సార్లైనా శనగల్ని తింటే గుండె జబ్బు లు వచ్చే ప్రమాదం చాల తక్కువగా ఉంటుంది. రక్త హీనత కూడా తగ్గిపోతుంది. ప్రమాదకరమైన కొలన్ కేన్సర్ ని అడ్డుకునే శక్తి శెనగలకు ఉంది. వీటిలో ఫోలిక్ యాసిడ్ ఉండడం వలన స్త్రీ లకు ఎంతో మేలుకలుగుతుంది.

శనగల్ని నాన పెట్టి, ఉడికించిన  తర్వాత  ఉప్పు, కారం ఉల్లిపాయ ముక్కలు కలిపి, చిరుతిండిగా  తినవచ్చు.లేదా కూరల్లోకూడా  వేసుకోవచ్చు. ఉడికించి తాలింపు వేసుకుని కూడా తినవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా తినడానికి వాడుకోవచ్చు.ఇమ్యూనిటీని పెంచే శక్తి సెనగలకు  ఉండడం వలన  రకరకాల వ్యాధులు రాకుండా రక్షణ ఇస్తుంది . ఎముకల్ని ధృఢంగా ఉండేలా చేస్తాయి. షుగర్  ఉన్న వారికి శనగలు బాగా పని చేస్తాయి.  అలాగే రక్తం లో తగినంత గ్లూకోజ్, చక్కర స్థాయిలని అదుపు లో ఉంచటంలో ఇవి ముఖ్య పాత్ర  పోషిస్తాయి. కాబట్టి శెనగలు తినడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు.


Share

Related posts

Adani : ప్రపంచ ధనవంతులను మించిన అదాని సంపద..! ఆయనే నెంబర్ వన్

arun kanna

బ్రేకింగ్: స్వర్ణ ప్యాలెస్ అసలు గట్టు బయటపెట్టిన కమిటీ… వారి వల్లే ప్రమాదం

Vihari

జగన్ ప్రమాణస్వీకారం అప్పుడు కన్న కల.. ఇప్పుడు తీర్చేందుకు కంకణం కట్టుకున్న మేకపాటి!

CMR