Coconut flower : మనం కొబ్బరి కాయ కొట్టినప్పుడు అప్పుడప్పుడు అందులో పువ్వు వస్తుంటుంది. అది కూడా ఎప్పుడో ఒకసారి అలా జరుగుతుంటుంది. అలా పువ్వు వస్తే మంచిది అని నమ్ముతుంటారు.కొబ్బరి పువ్వు పరిపక్వ కొబ్బరికాయలో అభివృద్ధి చెందుతున్న మొలక గా చెప్పుకోవచ్చు. కొబ్బరి, కొబ్బరి నీళ్లు, ఇంకా చెప్పాలంటే లేత కొబ్బరి లో నీటి కంటే కూడా ఎక్కువ పోషకాలు కొబ్బరి పువ్వులో నే ఉంటాయి.
కొబ్బరి, లేత కొబ్బరి లాగే కొబ్బరి పువ్వు రుచికూడా చాల బాగుంటుంది.
కొబ్బరి పువ్వు లో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి . కొబ్బరి పువ్వు కాలానుగుణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి మంచి రక్షణ కల్పిస్తుంది.
కొబ్బరి పువ్వు తినడం వల్ల మంచి శక్తి ని పొందవచ్చు. విటమిన్ ఏ, సి, కాపర్, క్యాల్షియం, పొటాషియం, మరియు ఫైబర్ కొబ్బరి పువ్వు లో పుష్కలంగా దొరుకుతాయి. ఈ పువ్వు వారానికి ఒక్కసారైనా తినడం వల్ల మానసిక దృఢత్వం బాగుంటుంది . ఇందులో ఉన్న విటమిన్ ఏ దృష్టి లోపాన్ని దూరం చేసి కంటి చూపుని పెంచుతుంది.కొబ్బరి పువ్వు ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఇది రక్తంలో అధిక చక్కెర నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
ఈ పువ్వు వలన గుండెలో కొవ్వు కరిగి దీనివల్ల గుండెజబ్బుల నుంచి రక్షణ కలుగుతుంది. ధైరాయిడ్ స్రావాన్ని అదుపుచేసి, థైరాయిడ్ నష్టాన్ని తగ్గిస్తుంది. శరీర బరువు అదుపులో ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది .ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. మూత్రపిండాల సమస్యలు కూడా తగ్గిస్తుంది.
కిడ్నీ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. కొబ్బరి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఇది వృద్ధాప్యాన్ని నివారించడం లో చాలా బాగా పనిచేస్తుంది. చర్మం ముడతలు, వృద్ధాప్యం, చర్మం పాడవడం వంటివి రాకుండా మంచి రక్షణ కలుగుతుంది. కొబ్బరిపువ్వులో ఉండే విటమిన్లు,ఖనిజాలు, గౌట్నుండికాపాడతాయి . మలబద్ధకాన్ని కూడా లేకుండా చేస్తాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?