కొబ్బరికాయను మనము రోజూ రకరకాల వంటల్లో ఉపయోగిస్తు ఉంటాం. అయితే కొబ్బరిలో అపారమైన పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి కొబ్బరిని మన ఆహారంలో భాగంగా చేసుకున్నా చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు డాక్టర్లు. ప్రెగ్నన్సీ సమయంలో కొబ్బరిని తినడం సురక్షితం మరియు మీ రెగ్యులర్ డైట్ లో కొబ్బరిని భాగంగా చేసుకున్నా ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎండుకొబ్బరి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ తరహాలో ఎండు కొబ్బరిని మనం రోజూ తీసుకోవచ్చు. రోజూ వంటకాల్లో ఎండు కొబ్బరిని వాడడం వలన అధిక పోషకాలు శరీరానికి లభిస్తాయి. చర్మానికి కూడా ఎండుకొబ్బరి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి ఎముకలకు బలాన్ని ఇస్తుంది.
ఎండుకొబ్బరిలో అనేక రకమైన ఖనిజాలు ఉంటాయి కాబట్టి కొబ్బరిని రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఖనిజ లోపాన్ని నివారించవచ్చు. ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు మనలిని దూరంగా ఉంచుతుంది. ఎండుకొబ్బరిలో ఫైబర్, కాపర్, సెలీనియం వంటి శరీరానికి అతి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి మనం ఎండుకొబ్బరిని అనేక విధాలుగా వంటలలో వినియోగిస్తూ ఉంటాము.
ఎండు కొబ్బరిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి రోజూ ఒక చిన్న ఎండుకొబ్బరి ముక్కను తింటే అందులోని ఫైబర్ వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ఎండుకొబ్బరి మెదడుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజూ కొబ్బరిని తీసుకోవడం వలన మతిమరపు సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఎండుకొబ్బరి మిమ్మలిని రకరకాల వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఎందుకంటే కొబ్బరి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎండు కొబ్బరిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది అనీమియాను నివారిస్తుంది.
ఎండు కొబ్బరి క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. క్యాన్సర్‌లో ముఖ్యంగా పేగుల్లో కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్‌కి ఎండుకొబ్బరి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇది అల్సర్‌ను దరిచేరనివ్వదు. ఆరోగ్యవంతమైన కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది మరియు గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
- కొబ్బరిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. పీచు పదార్థం మధుమేహం వచ్చే ప్రమాదాన్ని అరికడుతుంది. అంతేకాకుండా, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను తగ్గించి డయాబెటిస్ ను సైతం నియంత్రిస్తుంది.
- కొబ్బరి శరీరానికి చాలా శక్తిని అందిస్తుంది. దీనిలోని పోషకాలు మన శరీర అవయవాలు చురుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. ఇది శరీరంలోని కొవ్వును కరిగించి మన జీర్ణవ్యవస్థ చురుగ్గా పని చేసేలా చేస్తుంది. బరువు తగ్గాలి అనుకుంటున్న వారికి ఇది చాలా చక్కని ఉపాయం.
- పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
- విటమిన్ ఎ, బి, సి, థయామిన్, నియాసిన్, క్యాల్షియం కొబ్బరిలో అధిక మోతాదులో లభిస్తాయి. రోజూ కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి కొబ్బరిలో ఉండే ఫైబర్ వలన మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?