Apple: కొన్ని రకాల పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంటాయి. పలు రకాల పండ్లు నిత్యం తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనేది వైద్యులు చెబుతుంటారు. రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు వైద్యులు తెలియజేస్తుంటారు. యాపిల్ లో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉంటాయని, వీటిని తీసుకోవడం వల్ల వైద్యుల వద్దకు వెళ్లే అవకాశం రాదని తెలియజేస్తుంటారు.
ఎన్నో రకాల వ్యాధుల నుండి కలిగే ముప్పును తగ్గించడానికి యాపిల్ ఎంతగానో ఉపయోగపడతాయట. అయితే యాపిల్ తినడానికి షుగర్ వ్యాధితో బాధపడే వారు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. యాపిల్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భావిస్తున్నారు. వాస్తవానికి షుగర్ తో బాధపడే వారు యాపిల్ తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు.
షుగర్ వ్యాధితో బాధపడే వారు ఎలాంటి అనుమానాలు లేకుండా యాపిల్ ఆరగించవచ్చని చెబుతున్నారు. యాపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ షుగర్ ను నియంత్రించడానికి దోహదం చేస్తుంది. వివిధ పరిశోధనల ప్రకారం మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా లభిస్తాయని పేర్కొంటున్నారు వైద్యులు. యాపిల్ పండ్లలో ఉండే పాలీఫెనాల్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఉపయోగపడుతుందట. అదే విధంగా యాపిల్ పండులో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వాటిని తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ప్రధానంగా బరువు తగ్గాలనుకునే వారికి యాపిల్ పండు ఎంత గానో ఉపయోగపడుతుంది. రక్తపోటు, గుండె జబ్బులను నివారించడంలో యాపిల్ కీలక పాత్ర షోషిస్తుంది. ముఖ్యంగా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా యాపిల్ దోహదం చేస్తుంది.