NewsOrbit
న్యూస్ హెల్త్

టైంపాస్ కోసం అంటూ తెలియకుండానే చాలా పోషకాలను తీసుకుంటున్నారు…

టైంపాస్ కోసం అంటూ తెలియకుండానే చాలా పోషకాలను తీసుకుంటున్నారు...

సోంపు గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా ప్రతి ఒక్కరు ఆహారం తిన్న తర్వాత త్వరగా జీర్ణం అవ్వడానికి సోంపుని తింటూ ఉంటారు. మనం సోంపు ని  తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలుకు  దూరంగా ఉండవచ్చు. మధుమేహ వ్యాధిని సైతం ఈ సోంపు గింజలు అదుపులో ఉంచగలవని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సోంపు గింజల్లో ఎన్నో అరుదైన పోషకాలు ఉన్నాయి. మన శరీరానికి అవసరమైన శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఈ గింజలలో లభ్యమవుతాయి.

టైంపాస్ కోసం అంటూ తెలియకుండానే చాలా పోషకాలను తీసుకుంటున్నారు...

డయాబెటిస్‌ వ్యాధి ఉన్నవారు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గించుకునే అందుకు వీటిని రోజూ తీసుకునే ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. తాజా సోంపు గింజల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు పెరగరు. సోంపులో విటమిన్ సీ, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

అలాగే వీటితో పాటు క్లోరోజెనిక్ యాసిడ్, లైమొనెన్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. సోంపు గింజల్లో యాంటిసెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి మొటిమలు రావడానికి కారణమైన బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని కాపాడుతాయి. అంతే కాకుండా మొటిమలతో వచ్చే వాపు మరియు నొప్పిని కూడా సోంపు గింజలు తగ్గిస్తాయి.

ఈ సోంపు గింజలు డయాబెటిస్, కాన్సర్ మరియు గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. అధిక బరువు ఉన్నవారు మరియు షుగర్ ఉన్నవారు సోంపు గింజల్ని రోజూ తీసుకుంటే విటమిన్ సి శరీరానికి లభించి టైప్-2 డయాబెటిస్ లెవెల్స్ ను తగ్గించే అవకాశాలున్నాయని ఇటీవల పరిశోధనల్లో తేలింది.

సోంపు గింజల్ని రోజుకు ఒక పావు టీస్పూన్ తినడం గానీ లేదా ఇతర వంటల్లో వేసుకొని తినడం గానీ చేస్తే మంచి ఫలితం వుంటుంది. అయితే ప్రెగ్నెన్సీలో ఉన్నవారు, బాలింతలు సోంపు గింజల్లకు ఎంత దూరంగా ఉంటె అంత మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

సోంపు గింజల్లో రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఇనుము, సెలెలియం, మాంగనీస్ మరియు క్యాల్షియం వంటి శరీరానికి అవసరమైన అన్ని ముఖ్య ఖనిజాలు అధిక మొత్తంలో లభ్యమవుతాయి. సోంపు గింజలు మీకు సంవత్సరం పొడవునా దొరుకుతాయి. ఇవి సాధారణంగా పొడి రూపంలో లేదా గింజల రూపంలో దొరుకుతాయి.

పోతపాలు, డబ్బా పాలు తాగే పిల్లలకు సోంప్‌ తో ఎండపెట్టిన పుదీనా ఆకు చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకుని తేనెతో కలిపి రెండుపూటలా వాడితే అజీర్ణ సమస్యలు ఉండవు వారికి.

చర్మం మరియు కేశ సంరక్షణ కోసం మనం ఎన్నో రకాల ఉత్పత్తులను మార్చి మార్చి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య  కాలంలో సహజసిద్ధంగానే సౌందర్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన చాలామందిలో పెరుగుతుంది. సోంపు గింజలను ఉపయోగించి మన చర్మం అందంగా మరియు కాంతి వంతం గా మారేలా చేసుకోవచ్చు. దీనిలో ఉన్న ఎన్నో పోషకాలు మన శరీరానికి పోషణను అందించి చర్మ సంబంధమైన సమస్యలను దూరం చేస్తాయి.

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N