ప్రపంచం లో అత్యంత ఉత్తమమైన తేనె ఏదంటే… మానుకా తేనె అంటారు.మానుకా తేనెను మానుకా పువ్వుల నుంచీ తేనెటీగలు సేకరిస్తాయి. అందుకే ఈ తేనే కి ఆ పేరు వచ్చింది. ఈ పువ్వులు కేవలం న్యూజిలాండ్‌లో మాత్రమే ఉంటాయి. నిజమైన మానుకా పువ్వులుఏడాదిలో 2 నుంచీ 6 వారాలు మాత్రమే పూస్తాయి. వాటి నుంచీ వచ్చే తేనె ఖరీదైనది.
మరి అంత రేటు ఎక్కువగా ఉండే తేనె వల్ల ఎలాంటి ప్రయోజనాలుఉంటాయి అన్నసందేహానికి సమాధానం తెలుసుకుందాం. ఈ మానుకా తేనె,మిగతా తేనె ల కాకుండా కాస్త చిక్కగాఉండడం తో పాటు బంగారం రంగు లో ఉంటుంది.ఈ తేనె జార్ల ను యూనిక్ మానుకా ఫ్యాక్టర్ తయారుచేస్తోంది. 5+, 10+, 15+, 20+ వంటి గ్రేడ్లు ఉంటాయి. హై గ్రేడ్ ఉండే హనీ జార్స్‌లో వేసే తేనె… చాల ఎక్కువ నాణ్యత తో పాటు ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.
ఇందులో సహజసిద్ధమైన అమైనా యాసిడ్లు ఎంజైములు, ఉంటాయి. పైగా యాంటి బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఫలితంగా ఈ తేనె వాడితే, రకరకాల రోగాలు తగ్గుతాయి. అజీర్తి ,గొంతు గరగర, వంటి సమస్యల కు చక్కని పరిష్కారం ఇది. దీనితో వ్యాధినిరోధక శక్తి పెరగడం వలన రోగాలు వచ్చే అవకాశం ఉండదు.
ఈ మానుకా తేనే ధర విషయానికి వస్తే 100 శాతం శుద్ధమైన 250 గ్రాముల మానుకా తేనె రేటు రూ.4000కు పైనే ఉంటుంది. అంత రేటు ఉన్నాకూడా దీన్ని చాలా మంది వాడుతుంటారు . ఎందుకంటే దీన్ని వాడితే చాలా రోగాలు రాకుండా ఉంటాయి. మన దేశం లో చాలా రకాల తేనె లు ఈ మానుకా హనీ ఇస్తున్న ప్రయోజనాల్ని ఇస్తున్నాయి. అది ఎలా అంటేభారత దేశం లో ఉండే పువ్వుల తేనె కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నది .