చాల మంది కి ఫూల్ మఖానా అంటే తెలిసినంత బాగా తామర గింజలు అంటే తెలియకపోవచ్చు. హిందీలో మఖానా అంటే ఎండినవి అని అర్థం. వీటిని బీహార్ లో ఎక్కువగా పండిస్తారు. తెలుపు, ముదురు గోధుమ రంగులలో ఈ తామర గింజలు లబ్యమవుతాయి. ఈ గింజలు తామర పువ్వుల నుండి వస్తాయి.తామర గింజలు ప్రస్తుతం సూపర్మార్కెట్లలలో పూల్మఖనా పేరుతో దొరుకుతున్నాయి. వీటిని ఇంగ్లిష్ లో ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని పిలుస్తారు.
చూడడానికి ఇవి పాప్కార్న్లా అనిపిస్తాయి. వీటిని నేరుగా తినవచ్చు లేదా వండుకుని తినొచ్చు. వీటితో రకరకాల వంటలు వండుకోవచ్చు. ఇది ఎదో సరదాకు తినడం కాదు. వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.తామర గింజలు ఆహారం లో తీసుకోవడం వలన డయాబెటిస్ అదుపు లో ఉంటుందట. అద్భుతమైన పోషక విలువలు కలిగి ఉన్న కారణం గా ఇప్పుడు వీటిని సూపర్ ఫుడ్స్ లిస్టులో చేరుస్తున్నారు.
ఉత్తరాదిలో ఉపవాసం ఉన్న రోజు ల్లో తామర గింజలనుఆహారం గా తీసుకుంటూ వుంటారు. ఆయుర్వేదంలో కూడా వీటిని ఉపయోగిస్తారు. వీటిలో అధిక కేలరీలు, చెడుకొవ్వులుఉండకపోవడం వలన బరువు తగ్గాలనుకునేవారికి ఇవి ఒక మంచి దివ్యౌషధంగా పనిచేస్తాయి అని చెప్పాలి . వీటిలోప్రొటీన్లు,మంచి కార్బ్లు, బి1, బి2, బి3 విటమిన్లు,కాల్షియం, ఫొలేట్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ మొదలైనవి వున్నాయి.
అధిక రక్తపోటుకు కూడా ఇదే మంచి మందు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మఖనాలు రక్తం లో చక్కెర స్థాయిని నియంత్రించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. అయితే ఇవి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని తగిస్తుంది కాబట్టి షుగర్ ఉన్నవారు వీటిని మోతాదులోనే తీసుకోవాలి.
గర్భిణీ స్త్రీలకు , బాలింతలకు ఇది ఒక బలవర్ధకమైన ఆహారం గా చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల నీరసంతగ్గుతుంది . పొటాషియం ఎక్కువగా వుండి సోడియం తక్కువగా ఉండటం వల్ల బీ.పి ఉన్నవారికి కూడా చాలా మంచిది. అయితే కొందరికి ఈ తామర గింజలు పడవు. ఎలర్జీ, గ్యాస్ సమస్యలు వస్తాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?