ఇదివరకటి కాలం వారు కుంకుడు కాయలనునలగొట్టి, వాటిని వేడి నీటిలో నాన పెట్టి, పెరటిలో ఉన్న మందారం పువ్వులు ,ఆకులు వేసి ఆ రసంతో తలరుద్దుకునేవారు. అందుకే వారికీ త్వరగా జుట్టు తెల్లబడేది కాదు.. ఇంచుమించుగా అందరికి పెద్ద జుట్లు ఉండేవి. కానీ అంత సమయం కేటాయిచలేక ఈ రోజుల్లో కుంకుడుకాయలను వాడటం లేదు.నిజానికి కుంకుడు కాయలు వాడటం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడం తో పాటు..పేలు, చుండ్రులాంటి సమస్యలు ఉండవు.
కమలాతొక్కలు, నిమ్మతొక్కలు, మందారాకులు, మందారపూలు, ఎండబెట్టి మెంతులను పొడిచేసి కుంకుడు కాయలలో కలపవచ్చు. ఈ పొడులు మార్కెట్ లో కూడా దొరుకుతాయి. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానం చేయడం వలన జుట్టు నల్లగా ఉంటుంది త్వరగా జుట్టు తెల్లబడదు. జుట్టు ఊడకుండా ఉండడం తో పాటు మెత్తగా ఉంటుంది.
తల స్నానానికి కుంకుడుకాయలు వాడడం వలన వెంట్రుకలు జిడ్డులేకుండా బాగా శుభ్రపడతాయి. పైగా వీటిలో ఎటువంటి కెమికల్స్ లేకపోవడం వలన జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. కుంకుళ్ళు కేవలం తలస్నానానికి మాత్రమే కాదు చర్మ రక్షణకు,చర్మ ఆరోగ్యానికీ మృదుత్వానికీ, సహాయపడతాయి.చర్మానికి వచ్చే దురదలను ఎలర్జీలను తగ్గిస్తాయి .
ఖరీదయిన పట్టుచీరలను ఉతకాలన్న కుంకుడు రసం ఉపయోగించవలిసిందే. కుంకుడు రసం లో నానపెట్టి ఉతికితే అవి వాటి సహజత్వం కోల్పోకుండా ఉంటాయి . బంగారు ఆభరణాలను కుంకుడురసంలో నానబెట్టి, మెత్తని బ్రష్ తో మృదువుగా నెమ్మదిగా రుద్దితే అవి శుభ్రపడడం తో పాటు కొత్తవాటిలా మెరుస్తుంటాయి. కుంకుడు కాయలతో స్నానం త్వరగా అయిపోవాలంటే.. ఇలా చేయవచ్చు.. తలస్నానం చేయాలనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి కుంకుడు కాయలని వేడి వేడి నీళ్లల్లో వేసి నానబెట్టండి..లేదా ఒక గంటముందు వేడి నీటిలో వీటిని నానా పెట్టి రసం తీసుకుంటే వాటిని చితక్కొట్టవలిసిన పని తగ్గుతుంది, బాగా నాని ఉండడం వలన త్వరగా రసం వచ్చి పని త్వరగా పూర్తవుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?