తెలుగు పలికితే వ్యాయామం చేసినట్టా??

అచ్చమైన తెలుగు వారు కూడా  ఆంగ్లాక్షరాలని అందలం ఎక్కిస్తుంటే… తెలుగు తల్లి మూగబోయింది.
ఆంగ్లములో ఉండే అక్షరాలు A B C D లని  ఆడుతూ పాడుతూ తేలికగా పలికేస్తారు…
అక్షరాభ్యాసం నాడు మాత్రం  అచ్చులు దిద్దించడానికి ఆలోచిస్తున్నారు!

తెలుగు పలికితే వ్యాయామం చేసినట్టా??

తేట తేట తెలుగు, తేనెలొలుకు తెలుగు, తెలుగు వెలుగు ఈ మాటలన్ని కరువైపోతున్నాయి. ప్రతీఒక్కరూ ఇంగ్లీష్ బాట లో కి వెళ్లిపోతున్నవేళ తెలుగు భాష గొప్పదనాన్ని ప్రతీఒక్కరికీ తెలియజేయాల్సిన, తెలుసుకోవాలిసిన బాధ్యత అందరిపై ఉంది.

తెలుగు అక్షరాలను పలికి తే  అందమే కాదు.. మన శరీరంలో ఉండే ముఖ్యమైన కండరాలు సైతం  కదులుతాయి. కావాలంటే పరీక్షించి చూడండి కోండని అని చెబుతున్నారు నిపుణులు.
క, ఖ, గ, ఘ అనే అక్షరాలను పలికినప్పుడు పొట్ట కండరాల కదలిక గమనించవచ్చు.  ఇ,క చ, ఛ, జ, ఝ అక్షరాలను చెప్పేటప్పుడు ఛాతీ భాగం కదులుతుంటుంది.
ట, ఠ, డ, ఢ లను పలికే టప్పుడు నాలుక కదిలి ఎక్సర్‌సైజ్ జరుగుతుంది .
ప, ఫ, బ, భ లను ఉచ్చరించినప్పుడు  పెదాల కండ రాలు కదులుతాయి.
య, ర, ల, వ లని చెప్పినప్పుడు  ముఖ,దవడ, కండరాలు కదులుతాయి.

ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.. తెలుగు భాష పలకడం మన గొప్పతనమే కాదు.. ఆరోగ్యం కూడా.. తెలుగుకి తగిన గౌరవాన్నిద్దాం..
కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు తెలుగు భాషను పలుకుతూ  వీడియోలను సోషల్ మీడియా లో పెడుతూ తమ ఆరోగ్య సమస్యలు పరిష్కారం అయినట్లు చెబుతున్నారు.. ఈ విధమైన వీడియోలు చాలానే ఉన్నాయి… ఒకసారి వాటిని చుసేప్రయత్నం చేయండి .