రాగి ప్రాతలో నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి చాల మంచిదని మన అందరికి తెలిసిందే.అదేవిధంగా చేతి వేలికి రాగి ఉంగరం పెట్టుకోవడం వలన కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. రాగి పాత్రలో నిల్వ చేసుకున్న నీటి లాగే రాగితో చేసిన ఆభరణాలను వేసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన శరీరం లో వేడి తగ్గి శరీరం చల్లబడడం తో పాటు రక్తపోటును అదుపులో ఉండేలా చేస్తుంది.
రాగి ఉంగరం పెట్టుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటునుండి రక్షణ ఇస్తుంది. తరచూ తలనొప్పి తో బాధపడే వారు రాగి ఉంగరంపెట్టుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు.
పనిలో ఒత్తిడి గా వున్నప్పుడు రాగి ఉంగరంపెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి . మనస్సు ప్రశాంతంగా ఉండడానికి కూడా రాగి ఉంగరం ఉపయోగపడుతుంది.
రాగితో చేసిన ఉంగరం, బ్రేస్లెట్, చెయిన్ వంటి ఆభరణాలను ధరించడం వల్ల వాటిలో ఉండే రాగి అణువులు చర్మం ద్వారా శరీరంలోకి వెళ్తూ శరీరానికి కావల్సిన ఇతర మినరల్స్ కూడా సక్రమంగా అందిస్తాయి.
ఇది శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరగకుండా ఆలస్యం చేయడం వలన వ్యాధి నిరోధకత పెరుగుతుంది.
బీపీ కంట్రోల్లో ఉంటుంది. గుండె కొట్టుకోవడం సహజ రేటులో జరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రావు .
అలాగే రాగి ఉంగరం పెట్టుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
రాగి ఉంగరాన్ని ధరించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరొక్కసారి తెలుసుకుందాం
- మెరుగైన రక్త ప్రసరణ ఉంటుంది.
- రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
- వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
- గుండె జబ్బులు రావు.
- ఎముకలు బలం గా ఉండేలా చేస్తుంది.
- ఉదర సంబంధిత సమస్యలు వుండవు
- రాగి ఉంగరంవాపులను తగ్గిస్తుంది.
- చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది.