వైట్ టీ దీన్ని తాగమని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు సూచిస్తున్నారు. రోజుకు మూడు కప్పులు తాగితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. దీనికి వైట్ టీ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం … తేయాకు చిగురుల పై ఉండే చిన్న తెల్లటి ముక్కలు అవి చాల స్వచ్ఛం గా మెరుస్తూ ఉంటాయి వాటిని ఈ టీలో వాడతారు. గ్రీన్, బ్లాక్, టీ ల్లో ఉండేంత కెఫైన్ కంటే తక్కువ కెఫైన్ ఇందులో ఉంటుంది. ఇప్పుడు ఈ వైట్ టీ లో కూడా చాలా రకాలు అందుబాటులో ఉంటున్నాయి . ఇది గ్రీన్ టీ కంటే చాల మంచిదని, దీని రుచి కూడా చాలా బాగుంటుందని అంటున్నారు.
చిగురు ఆకుల తో తయారుచేసే ఈ టీ లో ఎక్కువ పోషకాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పోషకాలు మన శరీరంలో విష వ్యర్థాల్ని బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం డార్జిలింగ్ వైట్ టీ అనేది ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందింది. ఐతే… దీని గురించి చాలా కొద్దీ మందికి మాత్రమే తెలుసు… అయితే ఈ టీ మాత్రం స్త్రీలకు అత్యంత ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుందని అంటున్నారు.
ఆన్ లైన్ మార్కెట్లో వైట్ టీ బ్యాగ్స్ అందుబాటులో ఉంటున్నాయి. దాదాపుగా ఒక్కో టీ బ్యాగ్ ఖరీదు రూ.20 గా ఉంటోంది. ఇప్పుడిప్పుడే అందరికి అలవాటవుతోంది కాబట్టి రేటు ఎక్కువగా ఉన్నాభవిష్యత్తులో ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు కాబట్టి… ధర తగ్గే అవకాశాలుంటాయి.మరో విషయమేంటంటే… ఈ టీ తయారీకి ఎక్కువ సమయం అవసరం లేదు.
వైట్ టీ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం… నీటిని 200ml తీసుకుని 5 నిమిషాల పాటు కాచినప్పుడు బుడగలు వస్తాయి. అప్పుడు ఆ నీటిని కప్పులో పోసి అందులో వైట్ టీ బ్యాగ్ వెయ్యాలి. రెండు నిమిషాల్లో అందులోని సారం అంత నీటి లో కి దిగుతుంది.దీనికి చక్కెర లేదా తేనె ఏదైనా కలుపుకోవచ్చు . ఐతే బరువు తగ్గాలనుకునే వారుమాత్రం.. తేనె కలుపుకుంటే బాగా పనిచేస్తుంది.
వైట్ టీలో కాటెచిన్స్ అనే పాలీఫెనాల్స్ ఉండడం వలన అవి శరీరంలోని విష వ్యర్థాలను,గుండె జబ్బుల్ని,పొట్ట చుట్టూ ఉండే కొవ్వు ను తగ్గిస్తుంది. ముసలితనపు లక్షణాలు రాకుండా, జుట్టును కాపాడటంలో, సూర్యుడి వేడి నుంచీ చర్మాన్ని, కణాలనూ రక్షించడం లో బాగా ఉపయోగ పడుతుంది.