Jasmine: వేసవి లో ఎక్కువగా లభించే మల్లెలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.వాటినిఉపయోగించి ఎన్నో అనారోగ్యసమస్యల నుండిబయట పడవచ్చు.వాటి గురించి తెలుసుకుందాం. మల్లెపూలు మానసిక ఆహ్లాదాన్నిప్రశాంతతని ఇస్తుంటాయి.అయితే ఈ పూలను ఔషధాలుగా కూడా ఎలా వాడవచ్చో తెలుసుకుందాం.
అతి కోపం, మానసిక ఆందోళన, డిప్రెషన్, మానసిక చాంచల్యత వంటి వాటిని నెమ్మదింప చేసే తత్వం మల్లెపూలలో ఉంది. మంచి సువాసన వెదజల్లే మల్లెపూలు ఒక గుప్పెడు తీసుకుని తల దిండు పక్కన పెట్టుకుని నిద్రించిన… లేదా దీర్ఘ శ్వాస తో సువాసనను పీల్చిన మంచి ఫలితం ఉంటుంది. ఇలా రోజుకు పది సార్లు చేస్తే.. మనసు స్థిమితంగా ఉండి మంచి నిద్ర వస్తుంది.
మల్లెలు, గులాబీ నుంచి రసం తీసుకుని ముఖానికి రాసుకోవడం వలన ఛాయ మెరుగుపడుతుంది.
కొబ్బరినూనెలో గుప్పెడు మల్లెపూలు వేసి ఒక రోజంతా నానబెట్టి ఆ తర్వాత కాచి వాడ కొట్టి చల్లారిన తర్వాత తలకు మసాజ్ చేసుకుంటే.. జుట్టు కుదుళ్లకు మంచి పోషణ లభిస్తుంది. తాజా మల్లెలను తీసుకుని మెత్తగా నూరి.. తడిబట్ట లో చుట్టి, కళ్ళ మీద ఉంచుకుంటే, కళ్లలో నీళ్లు కారడం,కళ్ళు పొడిబారడం కళ్ళు మూసినా, తెరిచినా ఇరిటేషన్ రావడం వంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. తలనొప్పి, తలంతా పట్టేసినట్లు ఉండడం వంటి సమస్యలకు మల్లెపూలతో తలకు కట్టు కడితే.. సమస్య తగ్గుతుంది. మల్లెల్లోఉండే సువాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడం తో పాటు తలనొప్పి తగ్గేలా చేస్తుంది .
కళ్ల మంటలు, నొప్పులు తగ్గడానికి మల్లెల కషాయాన్ని ఉపయోగించవచ్చు . పూలు, ఆకులు కషాయం కాచి వడగట్టి చల్లార్చి.. రెండు వంతుల కషాయం లో ఒక వంతు నువ్వుల నూనె, ఒక వంతు కొబ్బరి నూనె, ఒక స్పూన్ బాదం నూనె ను కలుపుకుని,ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు చొప్పున తలకు మసాజ్ చేసుకుంటే ఉపశమనం గా ఉంటుంది. షుగరు ఉన్నవారు, మల్లెపూలతో చేసిన టీ తాగడం మంచి ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం మల్లెలకు బాగా ఉంటుంది