NewsOrbit
Entertainment News ట్రెండింగ్ న్యూస్

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్ హౌస్ నందు బర్త్ డే పార్టీ పేరుతో భారీ ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించ‌గా.. కర్ణాటక పోలీసులు ప‌క్కా ఆధారాల‌తో తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు రైడ్ చేశాడు. ఈ రైడ్ లో భారీగా డ్ర‌గ్స్ ల‌భ్య‌మ‌వ‌డంతో పోలీసులు సీరియ‌స్ అయ్యారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పార్టీలో పాల్గొన్న‌వారిని అదుపులోకి తీసుకుని విచార‌ణ చేస్తున్నారు. తాజాగా బెంగ‌ళూరు పోలీస్ క‌మిష‌న‌ర్ బి. దయానంద్ మీడియాతో మాట్లాడుతూ.. రేవ్ పార్టీకి సంబంధించిన కొన్ని షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు.

క‌మిష‌న‌ర్ దయానంద్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. హైదరాబాద్ బిజినెస్ మెన్ వాసు త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బెంగ‌ళూరులోని గోపాల్ రెడ్డి యొక్క జీఆర్ ఫార్మ్ హౌస్ లో `సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ` పేరుతో ఆదివారం సాయంత్రం నుండి రేవ్ పార్టీని నిర్వ‌హించాడు. ఈ పార్టీ మొత్తానికి ఇన్ చార్జిగా వాసు బంధువు అరుణ్ వ్యవహరించాడు. సుమారు 150 మంది రేవ్ పార్టీకి హాజరైనట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. అయితే అందులో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారే ఉన్నారు.

పార్టీ లో పలువురు డ్రగ్స్ వినియోగించారు. దాడి చేసిన టైమ్ లో డ్రగ్స్ ను నాశనం చేయ‌డానికి ప్రయత్నించారు. స్విమ్మింగ్ పూల్స్, ప్రహరీ గోడ బయట డ్ర‌గ్స్ ను విసిరేయ‌గా.. డాగ్ స్వ్కాడ్ సాయంతో పోలీసులు మ‌త్తుప‌దార్థాల‌ను గుర్తించారు. 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుంద‌ని ద‌యానంద్ వెల్ల‌డించారు.

అలాగే బెంగ‌ళూరులో జ‌రిగిన ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ. 50 ల‌క్ష‌లు అని మీడియాతో ద‌యానంద్ వెల్ల‌డించారు. పార్టీ నిర్వాహకుడు వాసుతో పాటు మరో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు ద‌యానంద్ తెలిపారు. ఇక ఈ రేవ్ పార్టీలో ఒక తెలుగు న‌టి కూడా ఉంద‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. కానీ ఆమె ఆమె ఎవ‌రు, ఆమె వివ‌రాలేంటి..? అన్న విష‌యాలు ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. అయితే ఆ తెలుగు న‌టి హేమ‌నే అని బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

హేమ పేరు తెర‌పైకి రాగానే.. ఆమె సోష‌ల్ మీడియా ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీకి త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని.. తాను ఇప్పుడు హైద‌రాబాద్ లోని ఓ ఫామ్‌ హౌస్‌లో చిల్ అవుతున్నానని హేమ వీడియోలో చెప్పుకొచ్చింది. ట్విస్ట్‌ ఏంటంటే.. హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఓ ఫొటోను రిలీజ్ చేశారు. ఈ ఫొటోలోనూ మ‌రియు హేమ రిలీజ్ చేసిన వీడియోలోనూ ఆమె ఒకే డ్రెస్‌లో క‌నిపించింది. పైగా రేవ్‌ పార్టీకి తాను వెళ్లలేదంటూ హేమ పోస్ట్ చేసిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ అచ్చం బెంగ‌ళూరు ఫామ్ హౌస్ మాదిరిగానే ఉంది. దీంతో బెంగ‌ళూరు ఫామ్ హౌస్ నుంచే హేమ వీడియో రికార్డు చేసి పెట్టింద‌నే వాద‌న మొద‌లైంది. అస‌లు హేమ రేవ్ పార్టీకి వెళ్లిందా..? వెళ్ల‌లేదా..? ఇప్పుడు స‌స్పెన్స్ గా మారింది.

Related posts

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Chandrababu: ఆ అధికారులను కలిసేందుకు చంద్రబాబు విముఖత ..

sharma somaraju

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri