Music: సంగీతం చక్కని మానసిక పరిస్థితికి కారణం అవ్వడం తో పాటు ఆరోగ్యం మీద కూడా మంచి ప్రభావం చూపుతుంది . ఇంకా సంగీతం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..మన మనస్సు ఎంత బాగా లేకపోయినా.. ఎంత చికాకుగా ఉన్నా కూడా.. ఓ పది నిమిషాల పాటు నచ్చిన ఇష్టమైన పాటలు వినడం వల్ల మనస్సు ప్రశాంతమవుతుంది. మన భావోద్వేగాలను అదుపు చేయడం చేయడం లో సంగీతం ముందుంటుంది. కాబట్టి సంగీతం వింటూ ఉండడం వలన మానసిక శారీరక ప్రశాంతతను పొందుతాము .
మంచి మంద్ర స్థాయి సంగీతం వింటుంటే ఒత్తిడి నుండి దూరం గా జరగవచ్చు. అయితే ఈ ఉపశమనం కావాలంటే, పాటలు లేకుండా కేవలం ఇన్స్ట్రుమెంట్ సంగీతం మాత్రం వినాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్తో పోరాడుతున్నవారు చికిత్స చేయించుకుంటూనే.. అదే సమయంలో సంగీతం కూడా వింటుంటే చక్కని ఉపశమనంగా ఉంటుంది. అలాగే త్వరగా కోలుకునే అవకాశం చాలా ఎక్కువ అని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి.సంగీతం మానసికంగా మనకు స్వాంతన కలిగించడంతో పాటు, మానసిక వ్యాధులు నయం చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అల్జీమర్స్ సమస్య తో ఉన్నవారు సంగీతం వింటుంటే మతిమరుపును చాలా తేలికగా వదిలించుకోవచ్చు. ఆటిజం ఉన్న వారు సంగీతం వింటుంటే, వారి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా మెరుగవుతుంది . సంగీతం వినడం వల్ల ఒక విషయం పై శ్రద్ధ పెట్టడం, అందరి తో కలవడం వంటి విషయాల్లో వారి విధానం మెరుగుపడిందని పరిశోధనల్లో కూడా బయటపడింది.కోపం, డిప్రెషన్,భయం ఆత్రుత, వంటి వాటిని తగ్గించి మనసుకు ఆహ్లాదాన్ని పెంచుతుంది ఈ సంగీతం.
సంగీతం తో నొప్పులు తగ్గుతాయి అని ఎన్నో పరిశోధనల్లో రుజువు చేయబడింది. శస్త్రచికిత్స చేయించుకున్న వారు సంగీతంతో ఉపశమనాన్ని పొందవచ్చట. ఈ కారణం గా శస్త్రచికిత్స సమయంలో ఆ తర్వాత కూడా డాక్టర్లు మంచి సంగీతం ఆస్వాదించండి అని సూచిస్తూ ఉంటారు. నొప్పిని అదుపు చేయడానికి సంగీతాన్ని మించిన ఔషధం లేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గాయాల పాలైనప్పుడు కూడా రోజూ సంగీతం వినడం వల్ల ఆ నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందడం తో పాటు, గాయాలు కూడా త్వరగా తగ్గిపోతాయి. వ్యాయామం సమయంలో సంగీతం వింటే,మన లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది . బరువు తగ్గాలనిఅనుకునే వారు సంగీతం వింటూ వ్యాయామం చేస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయి. మనం మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా కలుగుతుంది. వెయిట్ లిఫ్ట్ చేస్తూ వ్యాయామం చేసేవారు.. సంగీతాన్ని వింటూ చేయడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందుతారు.
సంగీతం వినడం అనేది కేవలం పెద్దవారికి మాత్రమే కాదు .. పిల్లల యొక్క మెదడు డెవలప్మెంట్ కి కూడా సహాయపడుతుంది. పాటలు, రైమ్స్, జోల పాటలు, వంటివి పిల్లల మెదడు అభివృద్ధి చెందడానికి బాగా ఉపయోగపడుతుంది. అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి పాటలు వింటూ పెరిగే పిల్లలు.. వినని పిల్లలతో పోల్చితే ఎక్కువ తెలివిగా ఉంటారు అని డాక్టర్స్ తెలియచేస్తున్నారు. స్త్రీలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు.. మంద్ర సంగీతం వింటుంటే వారి కడుపులోని శిశువు కదలికల్లో మార్పు వస్తుంది. అలాగే బిడ్డ ఐక్యూ కూడా పెరుగుతుందట. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు ఆరోగ్యం సెట్ అవడానికి సంగీతం చాలా బాగా పని చేస్తుంది. కాబట్టి కుదిరినప్పుడల్లా మీరు సంగీతం వినడం మే కాకుండా మీ పిల్లలకు కూడా వినిపించండి.