Beauty tips: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ఈ రోజుల్లో రోజు రోజుకు మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం, అంతకంతకు పెరుగుతున్న కాలుష్యం, తగ్గిపోతున్న శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవడం , పని లో ఉండే ఒత్తిడి వల్ల చిన్న వయసులోనే పెద్ద వయసు వారిలా మారిపోతున్నారు.అయితే ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఈ సమస్య పరిష్కారానికి దివ్య ఔషదం గా పనిచేస్తుంది.
చెరుకు రసంతో యవ్వనం కోసం కావాల్సిన పోషకాలు సులభం గా పొందవచ్చు. పుచ్చకాయ లో విటమిన్లు A, B, C లు పుష్కలంగా ఉంటాయి . ఇది అధిక బరువు మరియు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం వలన వృద్ధాప్య ఛాయలు లేకుండా యవ్వనంగా కనబడేలా చేస్తాయి.
బాదం,ఎండిన ద్రాక్ష,పిస్తా పప్పు, జీడిపప్పు, ఖార్జుర ఫలాలు ఎక్కువగా విటమిన్ E ,ఐరన్, జింక్, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కలిగి ఉండడం తో పాటు ఇందులో ఉండే నూనెల వలన ముఖకాంతి పెరిగి యవ్వనంగా ఉండేలా చేస్తాయి.
తేనె నిండా పోషకాలె ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించి, తక్షణ శక్తి ని అందించడం తో పాటు మతిమరుపు ని పోగొడుతుంది.పెరుగు శరీర ఉష్ణోగ్రతలను తగ్గించి జీర్ణక్రియ పక్రియ ను వేగవంతం చేస్తుంది.ఈరెండింటిని కలిపి తీసుకోవడం వలన నిత్యా యవ్వనం గా ఉంటారు. వెల్లులి అధిక రక్తపోటు ను,ఒంట్లో ఉండే చెడు కొవ్వును తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది.
టమాటా అధిక రోగ నిరోధక శక్తి గలది. ఇది కేన్సర్లను ,గుండె సంబంధిత వ్యాధులనుఅడ్డుకుంటుంది. ‘ఎ, ‘ఇ విటమిన్లు టమాట లో బాగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది.పోషకాలు అధికంగా ఉండే పచ్చని ఆకుకూరలుప్రతి రోజు ఆహారంలో తీసుకోవాలి.
ప్రతి రోజు నడక , చిన్న పాటి వ్యాయామం లాంటివి చేయడం వల్ల ఉత్సాహం గా ఉండడం తో పాటు యంగ్ గా కనిపిస్తారు.