ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు లో తీరిక లేకుండా పని చేసేవాళ్లకు ఆహారం తీసుకోవడానికి కూడా సమయం దొరకదు.
ఉదయం తీసుకునే అల్పాహారానికి, మధ్యాహ్న బోజననానికి మధ్య లేదా మధ్యాహాన్న బోజనం చేసిన రెండు మూడు గంటల తర్వాత ఆకలేస్తే ఆ ఆకలిని తీర్చేది స్నాక్స్. అయితే ఆ తీసుకునే స్నాక్స్ ఆరోగ్యాన్ని ఇచ్చేవి గా ఉండాలి.వారం లో మనం పని చేసే ఐదు రోజుల కోసం… ఐదు ప్రొటీన్ స్నాక్స్ ఏంటో చూద్దాం…
పల్లీలు, కాజు, బాదాం లాంటి డ్రైఫ్రూట్స్ మిక్స్ చేసి గోధుమలు, మల్టీ గ్రెయిన్‌తో చేసే మఫిన్స్ బాగా రుచి గా ఉండి మంచి ఆరోగ్యానికి సహాయపడతాయి.అయితే వీటిలో నూనె వాడకుండా నెయ్యి వాడాలి. చక్కెర తక్కువ వేసుకోవాలి. మీరు పనిలో మునిగి పోయిన కూడా మఫిన్స్ తినడానికి చాల అనుకూలంగా ఉంటాయి. ఎండుద్రాక్ష,జీడీ పప్పు,బాదాం, పిస్తా, వాల్నట్స్ ఇలా రకరకాల డ్రైఫ్రూట్స్‌తో ఐదు ప్యాకెట్లు సిద్ధం చేసుకుంటే… ఇక వారమంతా తినడానికి స్నాక్స్ సిద్ధం గా ఉన్నట్టే.
రోజులో ఒక్కసారైనా ఇవి తినడం చాల మంచిది. ప్రొటీన్ బార్స్ శక్తి స్థాయిలను పెంచుతాయి.ఇంట్లో తయారు చేసే ప్రొటీన్ బార్ అయితే చాల మంచిది.ఇంట్లో తయారు చేసుకొ లేని వారు RXBAR ఆర్డర్ చేసుకోవచ్చు. విటమిన్లు,ప్రొటీన్లు, బాగా దొరికే ఆహారం ఏ మొలకెత్తిన గింజలు. వీటికి ఉల్లిపాయముక్కలు , టమాట, కీరదోస, క్యాప్సికమ్, నిమ్మకాయ కలిపి తింటే మంచి రుచివస్తుంది. ఈ ప్రొటీన్ స్నాక్స్‌తో పాటు తాజా పండ్లను తింటూ జంక్ ఫుడ్‌కు అస్సలు అవకాశం ఇవ్వకండి. ప్రోటీన్ స్నాక్స్ తినడం వలన ఆరోగ్యం గా ఉండడం తో పాటు బరువు అదుపులో ఉంటుంది.