మొలకల నుంచి శరీరానికి ఎక్కువ పోషణ అందాలంటే ఇలా చెయ్యండి

మొలకలలో పీచు, ఫోలేట్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఉదయం లేవగానే మొలకలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, ఈ మొలకెత్తిన గింజలను ఆహారంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

మొలకల నుంచి శరీరానికి ఎక్కువ పోషణ అందాలంటే ఇలా చెయ్యండి

మొలకెత్తిన గింజలు, ధాన్యాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మొలకెత్తిన గింజలలో విటమిన్ ఎ ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుంది. గింజలు మొలకెత్తడం చాలా తేలిక మరియు తినడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంటాయి.

ప్రతిరోజూ స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల మీ శరీరానికి ఎక్కువ పోషణ లభిస్తుంది. అదే విధంగా వీటిని రోజువారి ఆహారంలో కలిపి తీసుకుంటే మరింత మేలు కలుగుతుందట. విత్తనాన్ని మొలకెత్తిస్తే అందులోని ఎంజైములు ఆక్టివేట్ అయ్యి ఆ గింజలలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. ఆ గింజలలోని ఎంజైములు పోషకాలను మన శరీరానికి సులభంగా అందే రూపంలోకి మార్చటమే గాక కొన్ని పోషకాలను కొత్తగా సృష్టిస్తాయి.

మన రోజువారీ ఆహారంలో ఉపయోగించే ధాన్యాలు, పప్పులను, మొలకెత్తిస్తే వాటిలోని పోషక విలువలు పెరుగుతాయి. పప్పులు మరియు ధాన్యలలో మాంసకృత్తులు పుష్కలంగా వుంటాయి.

మాంసకృత్తులు అమైనో ఆమ్లాలుగా విభజంచబడి శరీరానికి అవసరమైన ఆమైనో ఆమ్లాల నిష్పత్తిలో మారుతాయి. కాబట్టి మాంసకృతులు శరీరంలోకి సులభంగా జీర్ణమై శరీర పోషణకు సహాయపడతాయి.

అధిక మాంసకృతులు: మీ రోజూవారీ ఆహారంతో పాటు మొలకలు తీసుకోవడం వలన మీ శరీరానికి అవసరమైన మాంసకృతులను అందుతాయి మరియు జంతువుల మాంసాల వలన శరీరంలో పేరుకున్న కొవ్వును, క్యాలరీలను సైతం తగ్గిస్తుంది.