Relationship tips: శృంగారం జంటల మధ్య బంధాన్ని పటిష్టం చేయడంతో పాటు మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలిగేలా చేస్తుంది. అయితే చాలామంది జంటలు బిజీ జీవితాన్ని గడపడం తో సమయం లేక శృంగారానికి దూరంగా ఉండడం వలన అది మీ సంబంధాన్ని బీటలు వారెలా చేస్తుందని మరువకండి… అయితే చాల మంది దంపతులు ఈ రోజుల్లో ఉండే తీరికలేని జీవితం లో శృంగార జీవితాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దు కోవడానికి.. శృంగారం కోసం షెడ్యూల్ పెట్టుకుంటున్నారు . ఇప్పటి జీవన విధానం లో ఇది ఒక కీలకమైన ప్రక్రియగా ఉంది . ఇలా చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
ఒకవేళ మీరు తీరికలేని జీవితం గడుపుతూ వుండి.. మీ బంధాన్ని మరింత గా బలపరచుకోవడానికి శృంగారంలో పాల్గొనాలనుకుంటే సమయాన్ని ముందుగా నిర్ణయించుకోవడం అనేది మంచి పద్దతి.ఆ తేదీ ని గుర్తుపెట్టుకోవడం కోసం రిమైండ్ర్గా కానీ క్యాలెండర్లోగాని రాసిపెట్టుకోవడం మంచిది. రాసిపెట్టుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇది వాయిదా పడకుండా చూసుకోవడం చాల అవసరం. ఇక శృంగారం కోసం ఎంచుకున్న సమయం సరయినదిగా ఉండాలి. ప్లాన్ చేసుకున్న విధం గానే మీ ఇద్దరు ఏకాంత సమయాన్ని గడపాలి.
ఈ సమయంలో భాగస్వాముల మధ్య ఇతర ఏ విషయాలు చర్చకు రాకూడదు. ఇతర విషయాల కు అవకాశం ఇవ్వకుండా మీ మధ్య ప్రేమ ,అన్యోన్యత పెంచే విషయాలను మాట్లాడుకుంటే శృంగారం కోసం వెచ్చించిన సమయం మరింత మధురాతి మధురం గా గడుస్తుంది. అలా చేయడం వలన మీరు మీ భాగస్వామితో సన్నిహిత క్షణాలను ఆస్వాదించగలుగుతారు.
మీరిద్దరూ శృంగారం ప్లాన్ చేస్తున్నప్పుడు, ఆ క్షణా కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. మీ శృంగార జీవితంలో ఈ అంశాలన్ని చాలా ముఖ్యమైనవి గా భావించాలి.