గ్యాడ్జెట్లను చేతిలోపెట్టుకుని వర్చువల్ డేటింగ్ చేసేవారంతా తమ క్రియేటివిటీకి మెరుగులు దిద్దుతున్నారు. ఇది ఓ దశవరకు మంచిదే. కానీ హద్దులు దాటితే మాత్రం ఇది నటనకు దారితీస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. జీవితం లో కాసేపు నటించగలం కానీ నటనే జీవితం గా బ్రతకలేము. ఎదుటివారిని మెప్పించాలి అన్న సాకు తో మీమ్మల్ని మీరు మోసం చేసుకోకండి.
ఎప్పటికీ ఇలా వర్చువల్ వల్డ్ లో జీవించలేం కనుక నిజ జీవితం లో నే బ్రతకండి. మీకు నచ్చిన వ్యక్తి కోసం మీ అభిరుచులు, స్టైల్స్, ఫ్యాషన్స్ అన్నీ మార్చుకునిఎన్ని రోజులు ఉండగలరు? మీ ఆత్మాభిమానం, నైతికత దెబ్బతిని నటించలేక, మీరే మానసికం గా డీలా పడి, డిప్రెషన్లో కి వెళ్ళిపోతారు. మీకు నచ్చిన వ్యక్తితో మీరు కాని మీరు ఎంతకాలం డేటింగ్ చేయగలరు?జీవిత భాగస్వామి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోవడం వేరు, అసలు అప్పుడు కూడా అలా బ్రతకటం కష్టమనే చెప్పాలి.అలాంటిది ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ లో కేవలం పరిచయం పెంచుకునేందుకు మారిపోవడం అనేది వేరు అని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మీరు గానే ఉండండి.. అలా ఇష్టపడినవారినే జీవితం లో కి ఆహ్వానించండి.