Snoring : ప్రశాంతమైన నిద్ర జీవిత కాలాన్ని పెంచితే పెంచితే, గురక తో కూడిన నిద్ర జీవిత కాలాన్ని తగ్గిస్తుంది.ఈ కారణంగా గురకను నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలని నిపుణులు తెలియచేస్తున్నారు. గురక ఈ టిప్స్ పాటించి చూడండి. ఈ చిట్కాలు పాటించినా కూడా గురక తగ్గకపోతే.. వైద్యులను సంప్రదించండి లో ఆలస్యం చేయకండి .
ఈ చిట్కాలను పాటిస్తే గురక పూర్తిగా తగ్గిపోతుంది. గురక పెట్టే వారు ముందు గా ఆహారం తీసుకునే సమయాలలో మార్పు చేసుకోవాలి. రాత్రి 10 గంటలకు కడుపునిండా తిని వెంటనే పడుకోవడం అనేది అసలుమంచిదికాదు. 7 గంటలకే రాత్రి తినే ఆహారం ముగించేయాలి. ఇలా చేస్తే రాత్రి మీరు పడుకునే 10 గంటలకులోపు ఆహారంలో చాలా వరకు జీర్ణమైపోతుంది. దీనితో పొట్ట ఖాళీగా ఉండి ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి.
రాత్రి వేళల్లో అన్నం, ఉడికించిన ఇతర ఆహారాన్ని చాల తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రాత్రి పూట ఆహారం సాధ్యమైనంత తక్కువ తీసుకోవడమే మంచిది. అది కూడా ఉడికిన ఆహారానికి బదులు పండ్లు తినడం అలవాటు గా పెట్టుకోవాలి. ఇలా చేయడంవలన శ్వాసక్రియ బాగా జరుగుతుంది. గురకతో పాటు సకల అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం అధిక బరువు అని చెప్పక తప్పదు. బరువుతగ్గితే గురక కూడా పూర్తిగా తగ్గిపోతుంది
అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుని అర టీ స్పూన్ తేనె తో, కలిపి రాత్రి నిద్రకు ముందు తాగితే సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఒక గ్లాసు లో నీరుతీసుకుని ఒకటి లేదా రెండు పిప్పర్మెంట్ చుక్కలు వేసుకుని రాత్రి నిద్రపోయే ముందు బాగా పుక్కిలించడం తో పాటు పిప్పర్మెంట్ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే కూడా గురక కి మంచి ఉపశమనం లభిస్తుంది.
ఓ గ్లాసుడు వేడి నీటిలో అర టీ స్పూన్ యాలకుల పొడిని కలుపుకుని రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి రాత్రి పడుకొనే ముందు ఆవిరి పట్టినా గురక తగ్గుతుంది అని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు.