Schemes: సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లల భవిష్యత్తు కోసం తప్పకుండా ఆసరా ఉండడానికి ఏదో ఒక ఆస్తిని కూడపెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అందుకోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని అద్భుతమైన పథకాలను అందిస్తోంది. మరీ ముఖ్యంగా పెట్టుబడి లక్ష్యం, పన్ను , రిస్క్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తగిన పథకాలను ఎంపిక చేసుకోవడం చాలా ఉత్తమం. ఇకపోతే పిల్లల భవిష్యత్తును అత్యద్భుతంగా మార్చే ఆ పథకాల గురించి ఇప్పుడు చూద్దాం.

సుకన్య సమృద్ధి యోజన పథకం:
ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల నిమిత్తం తల్లిదండ్రులు డబ్బు ఆదా విషయంలో ప్రోత్సహించాలనే ప్రధాన ఉద్దేశంతోనే సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకంతో అధిక వడ్డీతో పాటు అనేక పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్:
దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా కనీసం రూ.500 తో ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్:
ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్లో వడ్డీ రేటు ఫిక్స్డ్ గా ఉంటుంది. లాకింగ్ పీరియడ్ లో ఇదే వడ్డీ మీకు వర్తిస్తుంది. ఈ స్కీం లో అర్జించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది ఇక ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80c కింద ఇన్వెస్టర్లు కింద మినహాయింపు పొందవచ్చు.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం:
ఇదొక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ తో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అధిక రిటర్న్లు పొందే అవకాశం ఉంటుంది. సెక్షన్ 80c కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.