టీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు మొదలవదు . లెమన్ టీ, గ్రీన్‌టీ, తులసి ఆకుల టీ, ఆరెంజ్ టీ ఇలా అనేక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎప్పుడు ఒకే రకం గా కాకుండా రక రకా ల టీ తాగడం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాల కలుగుతాయి. కానీ టీ లో చక్కెర వేయడం వేసుకోవడం వలన టీ పోషక విలువలను కోల్పోతుంది.
ఒక్కో టీ తయారు చేయడం లో ఓక్కో జౌషధ గుణాలున్న సుగంధ ద్రవ్యాన్ని వేస్తుంటారు . అటువంటి వాటిలో లవంగం కూడా ఒకటి. సాధారణ వంటల్లో, మాంసం కూరల్లో, బిర్యానీ తయారీలో ఉపయోగించే లవంగాలతో టీ కూడా తయారు చేయవచ్చు. లవంగాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో లవంగాలు నిండి ఉంటాయి. ఇవి ఇవి ఫ్రీ రాడికల్ డామేజ్‌తో పోరాడడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
లవంగం యొక్క బలమైన జెర్మిసైడల్ లక్షణాలు పంటి నొప్పి, గొంతు చిగుళ్ళు మరియు పూతల నివారణ కు ఉపయోగపడుతుంది. లవంగాల లో క్రిమినాశక, యాంటీమైక్రోబయల్ , యాంటీవైరల్ లక్షణాలు సమృద్ధి గా ఉంటాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, మరియు తలనొప్పిని నయం చేయడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి.
లవంగం లో ఉండే యూజీనాల్ జీర్ణక్రియ ను మెరుగు పర్చడానికి తోడ్పడుతుంది. బరువు తగ్గడానికి జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. లవంగం సహజంగా జీవ క్రియను మెరుగుపరుస్తుంది. లవంగాలు ఫ్రీ రాడికల్ చర్య తో పోరాడటం ద్వారా, అందమైన చర్మం సొంతమవుతుంది. లవంగాలు రక్తం లో చక్కెర స్థాయిలను నియంత్రిస్థాయి. లవంగం టీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
గిన్నెలో, ఒక కప్పు నీరు పోసి, తరువాత ఒక టేబుల్ స్పూన్ లవంగాల పొడి వేసి 5 నిముషాలు మరిగించి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఆ తర్వాత 3 నుంచి 4 నిమిషాలు పాటు ఆ టీ ని అలా వదిలేయండి.
టీ చల్లబడగానే, వడబోసి తాగండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?