Hair care tips: చిన ఆడవాళ్లకు జుట్టు అంటే ఎంతో ఇష్టం. ఆడవాళ్లు అనే కాదు మగవారికి కూడా జుట్టు అంటే మక్కువే. జుట్టు ప్రతి ఒక్కరికి అందాన్ని ఇస్తుంది. అలాగే నల్లటి, ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. జుట్టు రాలిపోవడం, జుట్టు పలచ బడి రాలిపోవడం, చుండ్రు వంటి రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు.ఈ క్రమంలోనే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు. నిజానికి వాటిని ఉపయోగించే బదులు ఇంట్లో దొరికే వాటితో సహజ సిద్ద పద్ధతులను ఉపయోగించడం మంచిది. ఎందుకంటే ఇంటి చిట్కాల వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.జుట్టు రాలకుండా ఉండడానికి ఇంట్లోనే దొరికే సామాగ్రితో ఒక చిట్కాను ట్రై చేసి చూడండి. ఈ చిట్కా వలన మీ జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది.
జుట్టు రాలకుండా ఉండడానికి చిట్కా :
మరి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా..ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గాను ఏమేమి పదార్ధాలు కావాలో ముందుగా తెలుసుకుందాం.ఇందుకోసం ఆలివ్ నూనె, శీకాకాయ పొడి, గుడ్లు,పెరుగును రెడిగా ఉంచుకోవాలి. మరి ఎలా తయారుచేయాలంటే ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల షీకాకాయ పొడిని వేసుకుని అందులో రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనెను, మూడు టీ స్పూన్ల పెరుగును, ఒక కోడి గుడ్డు మొత్తాన్ని వేసి బాగా కలపాలి.
జుట్టు రాలకుండా ఉండాలంటే..?
తరువాత ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి.ఒక అరగంట పాటు అలానే ఈ మిశ్రమంను తలకు పట్టించి ఉంచాలి.పూర్తిగా ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.ఇలా పైన చెప్పిన చిట్కాను క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు పాటించడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి. అలాగే మీ జుట్టు నల్లగా, ఒత్తుగా,పొడవుగా కూడా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కాను పాటించండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?