young look: చర్మంపై ముడతలు
వృద్ధాప్యానికి చేరుకోకుండా ఏ మనిషి ఉండలేరు కానీ.. ఎక్కువ కాలం యంగ్ గా కనబడేలా మాత్రం ట్రై చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందామా. కొన్ని రకాల చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల ముఖం ముడతలు పడకుండా చూసుకోవాలి . అవేంటో ఇప్పుడు చూద్దాం..మంచినీళ్లు బాగా తాగుతున్న వారి ముఖం ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ 8 గ్లాసుల మంచినీరు తాగాలి.. దాని వల్ల అందం తో పాటు ఆరోగ్యం కూడా .
తినే ఆహారంలో నూనెలు ,షుగర్ వాడకాన్ని తగ్గించడం వలన చర్మానికి చాలా మేలు కలుగుతుంది.మన రోజు వారి ఆహారంలో ఎక్కువ మొత్తం కూరగాయలు, పండ్లు, ప్రధానంగా క్యారెట్,నారింజ, అవకాడోలు ఎక్కువ తీసుకోవడం వలన వలన ఇది చర్మంపై ముడతలు తగ్గించడం తో పాటు ,చర్మం నిగారించేలా చేస్తాయి.
young look: సరిపడా నిద్ర
చర్మ ఆరోగ్యానికి నిద్ర కూడా చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి మనిషికి రోజు సరిపడా నిద్ర అనేది చాలా అవసరం. ప్రతి రోజూ 7 – 8 గంటల నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి. ఏ సీజన్లో అయినా స్కిన్ కి సన్ స్క్రీన్ లోషన్ వాడటం మాత్రం ఆపకూడదు. ఇది స్కిన్ కి ఇతర సమస్యలు ఏవి రాకుండా రక్షణ కల్పిస్తుంది. అలాగే వీలైనంతగా మేకప్ ప్రొడక్ట్స్ ను దూరంగా పెట్టండి. ముఖానికి బొప్పాయి గుజ్జు రాసి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కుదిరినప్పుడల్లా చేస్తుంటే, చర్మం నిగారింపుతో యవ్వనంగా కన్పిస్తుంది.రెండు స్పూన్ల తేనె తీసుకుని.. ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా కలిపి ముఖానికి, మెడకు అప్లై చేసి అయిదారు నిమిషాలు ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదువుగా ఉంటుంది. ఒక టీ స్పూన్ తో పసుపు తీసుకొని,అందులో పెరుగు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు ఆరనిచ్చి.. ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటే చర్మంపై ముడతలు రాకుండా అందంగా ఉంటుంది.