Detoxfying: మనిషి శరీరంలోని వ్యక్తపదార్థాలను ఎప్పటికప్పుడు డీటాక్స్ ప్రక్రియ ద్వారా తొలగించుకోవాలి. అప్పుడే వివిధ రకాల వ్యాధుల నుంచి సంరక్షణ ఉంటుంది. అంతేకాకుండా మనిషి ఆరోగ్యంగా కూడా ఉంటాడు. మరి ఈ డీటాక్స్ ఎలా చేయాలి..? ఎప్పుడెప్పుడు చేయాలో..? తెలుసుకుందాం..

శరీరానికి బాహ్య శుభ్రత ఎంత ముఖ్యమో.. అంతర్గత శుభ్రత కూడా అంతే అవసరం. శరీరం అంతర్గత శుభ్రత లేదా వ్యర్థ పదార్థాలపైనే ఆరోగ్యమైన, అనారోగ్యమైనా ఆధారపడి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు డీటాక్స్ చేస్తుండాలి. నిత్యం తినే వివిధ రకాల ఆహార పదార్థాలు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల జీర్ణం కానీ ఆహారం అంతా వ్యర్థాలుగా శరీరంలోనే ఉండిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం.. అంతేకాకుండా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఈ వ్యర్థాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. జంక్ ఫుడ్స్, కావలసినంత నీరు తాగకపోవడం, వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయేందుకు దోహదమవుతాయి. శరీరంలో విష పదార్థాలు ఎక్కువ అయినప్పుడు మీ శరీరం అందుకు సంబంధించిన సంకేతాలు వెలువరిస్తుంది.
నోటి దుర్వాసన:
మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే లేదా శరీరంపై చెమట నుంచి చెడు వాసన వస్తున్నా.. మీ శరీరంలో విష పదార్థాలు పేర్కొన్నాయని అర్థం. మీ శరీరంలో చాలా రకాల విషపదార్థాలు పేరుకు పోతుంటాయి. దాంతో ఎక్కువ చెమట పట్టడమే కాకుండా మీ శ్వాస కూడా చెడువాసన కలిగిస్తుంది. ఈ సమస్య ఎదురైనప్పుడు శరీరాన్ని డీటాక్స్ చేయాల్సి వస్తుంది.
మలబద్ధకం, కడుపు ఉబ్బరం:
అజీర్ణం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు శరీరాన్ని డీటాక్స్ చేయాల్సిన అవసరాన్ని సూచిస్తాయి. ఎందుకంటే ప్రేగుల్లో పేర్కొన్న వ్యర్థాలు, విష పదార్థాలు మీ జీర్ణశక్తిని పాడుచేసి కడుపు సంబంధిత సమస్యలకు దారి తీస్తాయి. ఈ పరిస్థితుల్లోనే వెంటనే శరీరాన్ని డీటాక్స్ చేయాల్సి ఉంటుంది.
విసుగు, నిరాసక్తత:
ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో మూడు పోవడం, విసుగు, పనిలో ఆసక్తి లేకపోవడం శరీరంలో విష పదార్థాలు పేరుకుపోవడం వలన జరుగుతుంది. చర్మ సంబంధిత సమస్యలు కూడా శరీరంలో వ్యర్థాలకు కారణంగా ఉంటాయి. మీ రక్తాన్ని అశుద్ధం చేస్తాయి..