Weight Loss Tips: బరువు తగ్గాలని తిండి తగ్గించడం సరైన పద్దతి కాదు . తినే ఆహారాన్నే ఏమి తినాలి, ఎలా తినాలి అనే విషయాన్ని ఆలోచించాలి. కొన్నినియమాలు పాటిస్తే ఎక్కువ ఆహారంతీసుకునే అవసరం తగ్గుతుంది. భోజనం తీసుకునే ముందే ఆకలి ని అదుపు చేసుకోవచ్చు. మనం ఎక్కువ నీరు తాగడం వలన తక్కువగా ఆహారం తింటాం. ఎందుకంటే… నీరు కడుపులోకి వెళ్లగానే, పొట్ట నిండినభావన కలుగుతుంది . కాబట్టి తక్కువగా తింటాము .
ఆహారం తక్కువ తినడం వలన శరీరం లోకి షుగర్, సాల్ట్, కొలెస్ట్రాల్ వంటివి ఎక్కువగాచేరవు . బరువు తగ్గుతాము. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ ప్రోటీన్స్ ఉండేలా తీసుకుంటే, రోజంతా తక్కువ ఆహారం తీసుకుంటారు. రెండు ఉడకబెట్టిన గుడ్లు, ఓ గిన్నెడు గ్రీక్ యోగర్ట్ ,ఓ కప్పు కాటేజ్ వెన్న,వంటివి తింటే ప్రోటీన్స్ బాగా అందుతాయి . ఆ తర్వాత ఇక ఏదీ తినబుద్ధి కాదు. నేలపై కూర్చొని తింటే… సరిపడా మాత్రమే తింటాం. బరువు తగ్గడానికి ఇది మంచి పద్దతిగా చెబుతున్నారు నిపుణులు .
భోజనానికి ముందు ఓ నాలుగు జీడిపప్పు లు బాదం పప్పు, వంటివి తింటే…పొట్ట నిండుగా అనిపిస్తుంది. దీనితో ఆహారం తక్కువ తీసుకుంటాం. పైగా… అవి శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చెడు కొవ్వునుతగ్గించి , మంచి కొవ్వును పెంచుతాయి. భోజనానికి ముందుకూరగాయలతో చేసిన సలాడ్ ను తినడం వలన పొట్ట నిండేలాచేయడం తో పాటు ఆరోగ్యన్ని ఇస్తుంది. అయితే ఈ సలాడ్‌లో తక్కువ కేలరీలు ఉన్న ఆకుకూరలు, కూరగాయల్ని మాత్రమే వాడాలి.
టీవి లేదా గాడ్జెట్టో వాడుతూ తినడం వంటివి పూర్తిగా మానేయాలి . ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ తినేలా చేస్తాయి. తినేటప్పుడు ఇలాంటివి అస్సలు ముట్టుకోకూడదు . టీవీ చూస్తున్నపుడు ఏమైనా తీసుకోవాలనిపిస్తే జాస్మిన్ టీ, గ్రీన్ టీ లాంటివి తీసుకోవాలి. అవి బరువును తగ్గించడం లో అద్భుతం గా పనిచేస్తాయి.
వారంలో నాలుగైదుసార్లు ఎండ తగిలేలా ఉండడం వలన డి విటమిన్, సెరొటోనిన్ పొందవచ్చు . సెరెటోనిన్ ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ఆనందం కలిగేలా చేస్తుంది . అలాని ఎండ లో ఎక్కువ సేపు ఉండటం కూడా మంచిది కాదు.