భారత విమానం మరో సారి పాకిస్థాన్ లో ఎమర్జెన్సీ ల్యాండయింది. షార్జా నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం లో ఉన్నంట్టుండి సాంకేతిక సమస్య తలెత్తింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ అప్రమత్తమైయ్యారు. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా పైలెట్ ఆ విమానాన్ని పాకిస్థాన్ లోని కరాచీ వైపు మళ్లించారు. కరాచీ ఎయిర్ లైన్స్ అధికారులతో సంప్రదించి అక్కడి ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్ లైన్స్ వివరణ ఇచ్చింది. విమానంలో సాంకేతిక సమస్య తలెెత్తడంతో పైలెట్ విమానాన్ని కరాచీలో సేఫ్ గా ల్యాండ్ చేశారని ఆ సంస్థ వెల్లడించింది. కరాచీలో దిగిన ప్రయాణీకుల కోసం మరో విమానాన్ని పంపుతున్నట్లు ఇండిగో వెల్లడించింది.
ఇదిలా ఉంటే .. రెండు వారాల వ్యవధిలోనే భారత్ కు చెందిన విమానం కరాచీలో ల్యాండింగ్ అవ్వడం ఇదే రెండో సారి కావడం గమనార్హం. ఢిల్లీ నుండి దుబాయి వెళుతున్న స్పైస్ జెట్ విమానం కూడా ఈ నెల 5న హడావుడిగా పాక్ లోని కరాచీకి మళ్లించాల్సి వచ్చింది. అప్పుడు ఫ్యూయల్ ఇండికేటర్ సరిగా పని చేయకపోవడంతో పైలెట్ విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో ఉన్న 150 మంది ప్రయాణీకులు కరాచీ నుండి దుబాయ్ వెళ్లేందుకు వీలుగా మరో విమానాన్ని భారత్ నుండి పంపారు.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…