Bheemla nayak: టాలీవుడ్ లో ప్రస్తుతం రూపొందుతోన్న క్రేజీ మల్టీస్టారర్ సినిమాలలో ‘భీమ్లా నాయక్’ కూడా ఒకటి. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్నారు. ఈ మూవీని మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కి అధికారిక రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తుండగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు త్వరలో మేకర్స్ ఓ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారట.
అయితే, ఇప్పటికే చిత్ర నిర్మాతలు ‘భీమ్లా నాయక్’ మూవీని ఫిబ్రవరి 25వ తేదీన అలాగే ఏప్రిల్ 1వ తేదీలలో ఏదో ఒకటి కన్‌ఫర్మ్ చేసి సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే..అభిమానులు ఏప్రిల్ వరకు వాయిదా వేయకుండా ఫిబ్రవరి 25వ తేదీనే రిలీజ్ చేయమని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ కూడా ముందు ప్రకటించిన ఫిబ్రవరి 25వ తేదీనే ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకే ప్లాన్ చేస్తున్నారట. దాంతో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న దాని ప్రకారం ‘భీమ్లా నాయక్’ ఓ మలయాళ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఇప్పటికే రూ.100 కోట్లకు పైగానే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకముందు పవన్ నటించిన వకీల్ సాబ్ కూడా అప్పటి పరిస్థితులను చూసుకుంటే రికార్డ్ స్థాయిలో దాదాపుగా రూ.910 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పుకున్నారు. ఇప్పుడు పవన్, రానాల మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’ అంతకు మించి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇంకా రిలీజ్ డేట్‌కు బాగానే సమయం ఉంది కాబట్టి ఇది రూ. 150 కోట్ల వరకు వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదు.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…