NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla Nayak : ప‌వ‌న్ అభిమానులారా కాలర్ ఎగరవేయండి.. భీమ్లా దెబ్బకు తెలంగాణ బాక్సాఫీస్ బద్దలవ్వబోతోంది!

Share

Bheemla Nayak : పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న భీమ్లా నాయ‌క్ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ అవ్వనుండడంతో అభిమానుల జాతర షురూ అయ్యింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ హైదరాబాద్, యూసఫ్ గూడా ఏరియా అంతా కూడా పవర్ స్టార్ అభిమానులతో నిండిపోయింది. పోలీస్ గ్రౌండ్ లో ఈ ఫంక్షన్ కన్నుల పండుగగా జరిగింది.

Bheemla Nayak : భీమ్లా విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం:

ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ సినిమా విషయంలో ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫిబ్ర‌వ‌రి 25 నుంచి మార్చి 11వ తేదీ వ‌ర‌కు భీమ్లా నాయ‌క్ చిత్రం 5వ ఆట ప్ర‌ద‌ర్శ‌న‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీంతో ప‌వ‌న్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. యూసుఫ్‌గూడ‌లోని పోలీసు గ్రౌండ్స్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుక‌కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ‘భీమ్లానాయక్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం నిర్ణయం:

ఇక సినిమా టిక్కెట్ల విషయం ఏపీ ప్రభత్వ వైఖరి తెలియంది కాదు. రీసెంటుగా ఈ విషయంలో తెలుగు సూపర్ స్టార్లు ఏపీ సీఎం జగన్ ను కలిసిన సంగతి విదితమే. ఈ క్రమంలో కాస్త ఊరట లభించినప్పటికీ అంత క్లారిటీ రాలేదనే చెప్పుకోవాలి. ఇక ఆ క్లారిటీ ఎల్లుండి అనగా 25న రానుంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తుండగా..సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రానా మరో కీలక పాత్రలో నటించాడు. నిత్యామీనన్, సంయుక్తా మీనన్ లు ఇందులో హీరోయిన్లు.


Share

Related posts

Ram Charan: ఆ ముగ్గురు అభిమానుల పనికి ముగ్ధుడైన రామ్ చరణ్!ఇంతకీ వారు చేసిందేంటంటే??

Yandamuri

బిజెపికి మరొకరు

somaraju sharma

‘మోదికి సాష్టాంగపడీ ఫిర్యాదు చేసుకోండి’

somaraju sharma